అక్రమ సంబంధం.. చాలా మంది దృష్టిలో ఇది సక్రమ సంబంధం అనే భావిస్తుంటారు. కట్టుకున్న వాళ్ల కళ్లుగప్పి చీకట్లో పరాయి వ్యక్తితో సంసారం చేయడాన్ని చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. జీవిత భాగస్వామికి తెలియకుండా ఎంత మందితో ఎఫైర్ నడిపితే అంత గుప్ప అన్నట్లు చాలా మంది ఫీలవుతున్నారు. విలువలు, నైతికతకు ఎప్పుడో నీళ్లొదిలేశారు. అయితే ఈ విషయంలో ఆడవాళ్లు కూడా తక్కువేం కాదు. ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చిన మహాతల్లులు చాలా మందే ఉన్నారు. క్షణిక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే చేసిన పాపం ఊరికే పోదు అంటారు కదా.. అలా కొందరిని పశ్చాతాపం రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. అలా ఓ మహిళ చివరికి తన ప్రాణాలే తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని మలప్పురంలో ఓ వ్యక్తి ఇంట్లో కరెంట్ పోయింది. తమకి ఒక్కరికే కరెంట్ పోయిందా? అందరికీ పోయిందా అనే విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకని పక్కిటి వారిని అడగాలి అనుకున్నాడు. వెళ్లి చూస్తే తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎవరూ పలకడం లేదు. సరే అని పక్కనే ఉన్న కిటికీ నుంచి లోపలికి చూశాడు. అక్కడ సౌజత్ అనే మహిళ తాడుకు వేలాడుతూ కనిపించింది. ఉరివేసుకుని అప్పటికే ఆమె ప్రాణాలను తీసుకుంది. పోలీసులకు సమాచారం అందివ్వగా.. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కేసు దర్యాప్తు విషయంలో పోలీసులకు కొన్ని నిజాలు తెలిశాయి.
ఉరివేసుకున్న మహిళ సాధరణమైన స్త్రీ ఏం కాదు. ఆమె భర్తను రాడ్డుతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రియుడు బషీర్‌తో కలిసి కట్టుకున్న భర్తను రాడ్డుతో కొట్టి చంపింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుకున్న అసలు కారణం ఏంటనేది తెలియలేదు. అయితే ఈ కేసు దర్యాప్తులో వారికి మరో విషయం తెలిసింది. అదేంటంటే.. సౌజత్‌తో కలిసి ఆమె భర్తను హత్య చేసిన బషీర్ కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతను పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చేరాడట. అయితే ఈ వార్త తెలుసుకున్న స్థానికులు చేసిన పాపం ఊరికే పోతుందా? ఇలాగే జరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.