Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. సోమవారం న్యాయయూర్తి సమక్షంలో పోలీసులు ఈ ప్రక్రియను నిర్వహించారు. చెంచల్ గూడ జైలులో ఉన్న సాదుద్దీన్‌తో పాటు జువైనల్ హోమ్‌లో ఉన్న మిగిలిన ఐదుగురిని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కొందరు ఖైదీల మధ్య అత్యాచార నిందితులను నిలబెట్టారు. బాధితురాలిని నిందితులు ఎవరో గుర్తించమని పోలీసులు అడిగారు. తనపై అత్యాచారం చేసిన వారిని బాలిక గుర్తించింది. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు జరిగాయి. అంతకముందు పోలీసుల విచారణలో నిందితులు పలు విషయాలను వెల్లడించారు. ‘ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఖాళీగానే ఉంటూ.. రోజూ పబ్ కి వెళ్తున్నాం. మేము మైనర్లం కాబట్టి మాకు పబ్ లోకి ఎంట్రీ ఉండదు.
అందుకే వేరే వాళ్లతో పార్టీలు ఏర్పాటు చేయించి.. బిల్ మేమే కడతామంటూ ఆ పార్టీలకు వెళ్తున్నాం. పబ్ కి వచ్చే బాలికలను ట్రాప్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇద్దరు అమ్మాయిలను చూశాక.. డేట్‌కు రమ్మని అడుగుదాం అనుకున్నాం. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని తప్పుగా బిహేవ్ చేశాం. వాళ్లకు భయంవేసి వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇద్దరిలో ఒక అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెండో అమ్మాయిని ముందుగా నిర్ణయించుకున్నట్లే మాయ మాటలు చెప్పి మా ట్రాప్ లో పడేశాం.
ప్లాన్ ప్రకారమే ఆమెను కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాం. పథకం ప్రకారమే ఇదంతా చేశాం. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ప్రేరణతో కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాం. చాలా ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్ లను చూశాం. వాటి ప్రేరణతోనే ఈ అమ్మాయిని అపహరించడం, అత్యాచారం చేయడం చేశాం’ అంటూ మైనర్లు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rajasthan: నీవు నాతో ఉన్న వీడియోలు బయటపెడతానంటూ.. ప్రియురాలిపై ప్రియుడు బ్లాక్ మెయిల్!