ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ నానా మాటలు చెప్పి నమ్మించాడు. దీంతో మనోడి మాటలను నమ్మిన ఆ యువతి ఎట్టకేలకు అతని ప్రేమ వలలో చిక్కుకుంది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు యువతితో తెగ తిరిగి జల్సాలు చేశాడు. చేసేటివన్ని చేసి చివరికి బ్లాక్ మెయిల్ కు దిగాడు. ప్రియుడి వేధింపులకు తట్టుకోలేకపోయిన ఆ ప్రియురాలు ఇదే విషయాన్ని తన తల్లికి వివరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్‌లోని అల్వార్. దీనికి సమీప ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ బాలిక 12వ తరగతి చదువుతోంది. ఈ సమయంలోనే ఆ యువతికి స్థానికంగా ఉండే ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో వెంటపడ్డ ఆ యువకుడు చివరికి ఆ యువతిని తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో కొన్నాళ్ల పాటు వీరిద్దరూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక ఇంతటితో ఆగకుండా ఇద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. అలా కొన్నాళ్ల పాటు వీరిద్దరు ప్రేమ విహారంలో తెలియాడారు.
ఇది కూడా చదవండి: East Godavari: ఉద్యోగం చేయటం ఇష్టంలేక యువతి ఆత్మహత్య!
అలా వారు శారీరకంగా కలుసుకున్నప్పుడు వీడియోలు తీశాడు. ఆ వీడియోలతో ప్రియుడు ఏకంగా బ్లాక్ మెయిల్ కు దిగాడు. నా సోదరుడితో పాటు కూడా శారీరకంగా కలవాలని.. లేకుంటే నీ వీడియోలు బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇలా ప్రియుడు వేధింపులు భరించలేని సదరు యువతి ఇదే విషయాన్ని తన తల్లికి వివరించింది. కోపంతో ఊగిపోయిన ప్రియురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.