మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు ఎలా ఉంటుందో.. ప్రజలను వారు ఎలా పట్టి పీడిస్తారో ఇప్పటికే అనేక సంఘటలను చూశాం.. చూస్తూనే ఉంటాం. నూటికి ఒక్కరో ఇద్దరో నిజాయతీగా, మానవత్వంతో వ్యవహరిస్తారు. ఇక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను లంచాల కోసం పీడించడమే కాక.. వారి దగ్గర పని చేసే వారిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా.. దారుణంగా హింసిస్తారు. మరి ముఖ్యంగా మైనర్లును పనిలో పెట్టుకుని వారిని చిత్రహింసలకు గురి చేస్తారు కొందరు శాడిస్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారి భార్య ఒకరు.. తమ ఇంట్లో పని చేసే బాలికపై అత్యంత కృరంగా ప్రవర్తించింది. కొట్టడం, తిట్టడమే కాక.. అత్యంత పాశవీకంగా బాధితురాలి నాలుకతో మూత్రాన్ని శుభ్రం చేయించింది. చదువుతుంటేనే కడుపులో దేవేస్తున్న ఈ దారుణమైన సంఘటన జార్ఖండ్, రాంచీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
మహేశ్వర్ పాత్రా అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం విధుల నుంచి రిటైర్ అయ్యాడు. అతడి భార్య పేరు సీమా పాత్ర. రాక్షసత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈమె. పదేళ్ల క్రితం సీమా తన ఇంట్లో పని చేసేందుకు గాను గుమ్లా అనే గ్రామానికి చెందిన సునీత అనే గిరిజన బాలికను పనికి పెట్టుకుంది. తరువాత సునీతను తన కుమార్తె ఇంట్లో కొన్నాళ్లు పని చేపించింది.
ఈ క్రమంలో సీమా భర్తకు రాంచీకి ట్రాన్సఫర్ అవ్వడంతో తమతో పాటు సునీతను కూడా తీసుకువచ్చింది. ఈ పదేళ్ల కాలంలో సునీతకు ప్రత్యక్ష నరకం చూపించింది సీమా. ప్రతి చిన్న విషయానికి బాధితురాలిని చేతికి దొరికిన వస్తువు తీసుకుని దారుణంగా చితకబాదేది. వేడి వేడి పెనంతో మూతి మీద వాతలు పెట్టేది.
ఈ హింసకు తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతానని అడిగినందుకు సునీతను ఓ గదిలో నిర్భందించింది. తినడానికి తిండి కాదు కదా.. కనీసం తాగడానికి నీరు కూడా ఇచ్చేవారు కాదు. ఎవరితో మాట్లాడనిచ్చేవాళ్లు కాదు. సీమా హింసకు తాళలేక ఓ సారి సునీత భయంతో బిక్కచచ్చిపోయి మూత్రం పోసుకుంది. దాంతో సీమాలో రాక్షసత్వం కట్టలు తెంచుకుంది. సునీత నాలుక చేతనే మూత్రాన్ని క్లీన్ చేయించి అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది.
ఈ క్రమంలో సునీత దారుణ స్థితి గురించి పోలీసులకు తెలిసింది. వారు సీమా ఇంటికి వచ్చి.. మెజిస్ట్రేట్ సమక్షంలో సునీతను విడిపించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఒంటిమీద బోలెడు గాయాలున్నాయి. మూతి మీద అనేక సార్లు బలంగా కొట్టడం వల్ల పళ్లు విరిగిపోయాయి. సునీతను ఆ స్థితిలో చూసిన వారు ఎవ్వరైనా సరే.. కన్నీరు పెట్టకోకమానరు. ప్రస్తుతం ఆమెకు చికిత్స ఇస్తున్నామని.. కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు. ప్రస్తుతం సీమా దంపతుల మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు.
ఈ మొత్తం దారుణంలో మానవతా కోణం ఏంటంటే.. సీమా.. సునీత విషయంలో చేసే దారుణాలను ఆమె కుమారుడు వ్యతిరేకించేవాడు. అడ్డుకునేందకు ప్రయత్నించేవాడు. కానీ లాభం లేకపోయింది. పైగా సీమా పైశాచికత్వం చూసి ఆమె కుమారుడు మతి స్థిమితం కోల్పోయాడు. ప్రస్తుతం ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీని గురించి తెలిసిన వారు సీమాను ఉరి తీసినా పాపం లేదని కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరు.. ఆమెను కూడా సునీతలానే హింసించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.