నేటికి మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూడ నమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. మూడ నమ్మకాలతో ఏవేవో చేస్తూ అనారోగ్య పాలవుతూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ మహిళ అనుమనాస్పద స్థితిలో మరణించింది. కాలిన శవం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు, యాసిడ్ బాటిల్ ఉండడంతో స్థానికులు ఖంగుతిన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? అది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలురు. ఇదే గ్రామానికి చెందిన మూటపురం బాబురావు అనే వ్యక్తి అనూష అనే మహిళను 2017లో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. కొన్నేళ్ల వరకు ఎలాంటి గొడవలు లేకుండా వీరు కాపురాన్ని నెట్టుకొచ్చారు. అయితే గత కొంత కాలం నుంచి భర్త బాబురావు కుటుంబ కలహాలతో భార్యను వేధింపులకు గురి చేస్తు ఉన్నాడు. ఈ క్రమంలోనే భార్య అనూషకు ఇటీవల అమ్మతల్లి సోకడంతో ఇంట్లోనే ఉంటుంది. అయితే ఉన్నట్టుండి అనూష ఆదివారం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మరణించింది. స్థానికులు కొందరు ఇంట్లోకి వచ్చి చూడగా.. కాలిన శవం, పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయలు, యాసిడ్ బాటిల్ కనిపించాయి. ఇది పక్కా క్షుద్రపూజలతో అత్తింటివాళ్లే అనూషను హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని పరిశీలించి అనంతరం భర్త బాబురావు, అత్తమామలను విచారించగా.., కోడలు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన అనూష కుటుంబ సభ్యులు వారి ఇంటి ముందు ధర్నాకు దిగారు. అత్తింటివాళ్లే మా అమ్మాయిని క్షుద్రపూజలతో హత్య చేశారని, మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు కలగజేసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించారు. తర్వాత అత్తింటి నుంచి రూ. 7.50 లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పెళ్లై రెండేళ్లు అవుతుంది.. కోరుకున్న సుఖం దక్కలేదని!