కలెక్టర్ హోదాలో ఉన్న ఆ వ్యక్తి బంట్రోతు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. బంట్రోతుపై తనకున్న ప్రేమను చూపించారు. తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని యువత కలలుకంటుంటారు. దీనికోసం నిరంతరం శ్రమిస్తుంటారు. కలెక్టర్ గా జిల్లా మొత్తానికి బాస్ గా ఉండి ప్రజలకు అవసరమైన సేవలందిస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసందానంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుంటారు కలెక్టర్ లు. అయితే ఐఏఎస్ హోదాలో కింది స్థాయి అధికారులకు, ఉద్యోగులకు ఆర్డర్లు వేసి పనులు చేయించుకోవడం మనం చూస్తుంటాం. కానీ అక్కడ ఓ కలెక్టర్ ఓ బంట్రోతు కాళ్లు మొక్కి ఎంత ఎదిగినా ఒదిగుండాలని సందేశాన్నిచ్చారు. బంట్రోతును సత్కరించి తన ప్రేమను చాటుకున్నాడు ఆ కలెక్టర్. వివరాల్లోకి వెళ్తే..
ఝార్ఖండ్ లో పలామా జిల్లా కలెక్టర్ దొడ్డే ఆంజనేయులు కలెక్టరేట్ లో పనిచేస్తున్న బంట్రోతు కాళ్లు మొక్కిన అరుదైన సందర్భం చోటుచేసుకుంది. పలామా జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అవుతూ కలెక్టర్ దొడ్డే ఆంజనేయులు అక్కడ పనిచేస్తున్న బంట్రోతులను శాలువాలతో సత్కరించారు. అయితే ఆ ముగ్గురిలో ఒకరైన నందలాల్ అనే బంట్రోతు కాళ్లకు నమస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలెక్టరేట్ లో నందలాల్ తనకు అందించిన సేవలను గుర్తుచేసుకుని భోవోద్వేగానికి గురయ్యారు. గతంలో తన తండ్రి వాచ్ మెన్ గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుని, తన తండ్రిలా భావించి బంట్రోతు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న కలెక్టర్ ఆంజనేయులు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఐఏఎస్ అధికారి బంట్రోతు కాళ్లు మొక్కడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.
IAS ने फेयरवेल में चपरासी के पैर छुए तो लोगों के आंसू छलके, अफसर बोले, मेरे पिता भी प्यून थे
.
.
.#IAS #JharkhandNews #IAS #Anjaneyulu #Dodde #viralvideo #Jharkhand pic.twitter.com/Q5pRY4ZODO— TheSootr (@TheSootr) July 28, 2023