పొట్టిగా ఉన్నానని ఈ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. కూతురు ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు అస్సలు నమ్మలేకపోతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పెళ్లి వయసు రాగానే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ప్రతీ యువతి కోరుకుంటుంది. కొందరు అమ్మాయిలు తల్లిదండ్రులు మెచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటుంటే, మరికొందరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ యువతి కూడా తల్లిదండ్రులు మెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అలా ఈ మధ్య కాలంలో రెండు, మూడు పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి. కానీ, అవి క్యాన్సిల్ అయ్యాయి. నేను పొట్టిగా ఉన్నందుకే వచ్చిన సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయని ఆ యువతి భావించింది. దీంతో ఆ యువతి ఉన్నట్టుండి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కూతురు అలా చేయడంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్ రాంచీ పరిధిలో పుండగ్ ప్రాంతంలో శ్వేత (22) అనే యువతి నివాసం ఉంటుంది. అయితే ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల రెండు, మూడు పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ, అవి సక్సెస్ కాలేకపోయాయి. నేను పొట్టిగా ఉండడం వల్లే ఈ సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయని ఈ యువతి భావించింది. దీంతో ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. తనలో తాను కుమిలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇలా అయితే నాకు పెళ్లి కాదని అనుకున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే శ్వేత గురువారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.