ప్రస్తుత కాలంలో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే విచ్చలవిడిగా లంచం అడుగుతున్నారు. ప్యూన్ నుండి ఉన్నతాధికారుల వరకు అవినీతి బాగోతమే కొనసాగుతుంది.
జీవితంలో చోటుచేసుకున్న కష్టాలు, అవమానాలే విజయానికి సోపానాలు. ఇటువంటి అనుభవ పాఠాలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి దోహదపడతాయి. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇదే రీతిలో ఓ యువకుడు తన చిన్న తనంలోనే తండ్రి చనిపోయినప్పటికి తల్లి కష్టం తో చదువుకుని దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఐఎఎస్ సాధించి ఆ తల్లి కష్టానికి ప్రతిఫలం అందించారు.
అది కరోనా మహమ్మారి విజృభిస్తున్న రోజులు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వ అధికారులు ఇంట్లో కూర్చుంటే ప్రజల అవసరాలు తీరవు కదా. అందుకోసం రిస్క్ చేసి కొంతమంది అధికారులు ప్రజల కోసం పని చేశారు. ముఖ్యంగా మహిళా కలెక్టర్లు. డెలివరీ అయ్యి ఎన్నో రోజులు కాకపోయినా.. సెలవులు ఉన్నా కూడా లెక్క చేయకుండా విధుల్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాంటి వారిలో మరో మహిళా కలెక్టర్ ఉన్నారు.
సాయం కోసం తన దగ్గరకు వచ్చిన ఓ పెద్దాయనతో ఒక ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఇలాంటి అధికారుల అవసరం దేశానికి మరింతగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
తల్లిదండ్రులు అంటే దైవాలతో సమానం. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసి.. జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది అలసిపోతే వారిని దగ్గరకు చేర్చుకుని చూడాల్సిన బాధ్యత పిల్లలదే. చూడకపోగా వారిని చులకనగా చూడడం, తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టడం లాంటివి చేయడం మహా పాపం. IAS నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ తమను కొడుకు, కోడళ్ళు పట్టించుకోవడం లేదని, తిండి కూడా పెట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇది ఇద్దరు మహిళా అధికారుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒక మహిళా పోలీస్ కి, మహిళా కలెక్టర్ కి మధ్య జరుగుతున్న యుద్ధం. కలెక్టర్ రోహిణి తన ప్రైవేట్ ఫోటోలను ఇతర కలెక్టర్లకు పంపించిందని రూప ఆరోపించగా.. తన ప్రైవేట్ ఫోటోలను రూప సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కరెక్ట్ కాదని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కలెక్టర్ రోహిణి, రూప ఐపీఎస్ ల మధ్య గొడవకు కారణం ఏంటి?
అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా ప్రేక్షకులకు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యిందంటే.. సామాన్యులు.. అధికారులు, రాజకీయనాయకులు ఎలా పని చేయాలని ఆలోచిస్తారో.. తప్పు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారో.. వ్యవస్థలో ఏ మార్పులు రావాలని భావిస్తారో.. వాటన్నింటిని తెర మీద కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఆ సినిమా భారీ విజయం సాధించింది. మరి వాస్తవంగా ఇలా పని చేసే అధికారులుంటారా అంటే.. ఎందుకుండరు.. కాకపోతే వారి గురించి చాలా తక్కువగా బయటి […]
సామాన్య మహిళలకే కాక ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. రెండు రోజుల క్రితం.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ ఆగంతుకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాక.. పట్టుకోవడానికి ప్రయత్నించిన స్వాతి మలివాల్‌ను కారుతో కొంత దూరం లాక్కెళ్లాడు. ఈ సంఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదికూడా హైదరాబాద్‌లో. అర్థరాత్రి మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి […]
ప్రేమించిన యువతిని పొందడం కోసం నెలరోజుల్లోనే లక్షలు సంపాదించడం.. కొండలు పిండి చేయడం.. అసాధ్యం అనుకున్న ఫీట్లను సాధించడం వంటివి సినిమాల్లోనే చూస్తాం. వాస్తవ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదు. నూటికో కోటికో.. ఎక్కడో ఒక చోట అలాంటి వారు తారసపడుతుంటారు. వారు ప్రేమించిన వ్యక్తి కోసం జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. ఆ వ్యక్తి శాంసంగ్ కంపెనీలో కోట్ల రూపాయల వేతనం వచ్చే కొలువులో […]
భారత్ సహా చాలా దేశాల్లో హృద్రోగుల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో సరైన శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం.. వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు లాంటి పలు కారణాల వల్ల గుండెపోటు బారిన పడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను ముందే గుర్తించకపోతే సడెన్‌గా వస్తే తట్టుకోవడం కష్టమని ఆరోగ్య నిపుణులు కూడా […]