బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పూర్ణిమా రంజన్, ప్రదీప్ సక్సెనా భార్యాభర్తలు. వీరికి కుమారుడు జతిన్, కూతురు మోహిన్ సంతానం. భార్య పూర్ణిమా స్థానికంగా ఇంటర్ నేషనల్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆర్థికంగా బలంగా ఉన్న ఈ కుటుంబంలో ఎలాంటి కష్టాలు దరి చేరలేదు. అయితే గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు భారీ వర్షాలకు స్కూలుకు సెలవులు ప్రకటించారు. దీంతో ఈ కుటుంబమంతా కలసి తమ సొంత కారులో విహార యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని సిందనూరు వద్ద వీరు హైదరాబాద్ తిరిగి వస్తుండగా వీరి కారును రాయచూరు వద్ద ఎదురుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Hyderabad: తండ్రి తిట్టాడనే మనస్తాపంతో..
దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోకి చొచ్చుకుపోయిన వారి మృతదేహాలను జేసీబీ యంత్రాలతో బయటకు తీశారు. వీరి మరణవార్త తెలుసున్న వారి కుటుంభికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే పూర్ణిమా పని చేసే స్కూల్లో ఆమె మరణవార్త తెలుసుకున్న తోటి అధ్యాపకులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.