పుస్తకాలు, పరీక్షలు లేకుండానే కొందరు కేటుగాళ్లు పరీక్షల్లో పాస్ చేస్తూ నకిలీ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. ఇలాంటి సర్టిఫికేట్లు తయారు చేస్తూ లక్షలు పోగేస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులను నమ్మించిన ఈ ముఠా.., నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తూ చేపకింద నీరులా గుట్టు చప్పుడు బిజినెస్ ను సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు మీడియా సమావేశంలో మరిన్ని విస్తుగొలిపే నిజాలు బయటపెట్టారు.
చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ కలీముద్దీన్ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తూ లక్షలు పోగేస్తున్నాడు. ఇలా ఎంతో మంది నిరుద్యోగులకు పుస్తకాలు, పరీక్షలు లేకుండానే.. ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి విద్యార్హత సర్టిఫికేట్లను అందించారు. చాలా మంది నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి లక్షల్లో సంపాదించారు. వీళ్లు తయారు చేసిన నకిలీ సర్టిఫికేట్లతో చాలా మంది విదేశాలకు వెళ్లినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ప్రధాన సూత్రదారి మహ్మద్ కలీముద్దీన్ చెప్పిన వివరాల ప్రకారం.., ఇతనితో పాటు ముక్తర్ అహ్మద్, ఎండీ ఫిరోజ్, సరుషుల్లా ఖాన్, జుబేర్ అలీలను అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరితో పాటు సయ్యద్ అతీపుద్దీన్, ఫరూక్ అజీజ్ వంటి ముఠా సభ్యులను సైతం పోలీసులు అరెస్ట్ వారి వద్ద నుంచి ల్యాప్ టాప్ లు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. ఇలా ఫేక్ సర్టిఫికేట్లతో లక్షలు సంపాదిస్తున్న ఈ ముఠా సభ్యుల తీరుపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.