నేటికాలంలో ఎవర్ని నమ్మాల్లో ఎవర్ని నమ్మకూడదో కూడా అర్ధం కాదు. మన చుట్టూ ఉండే వారు ఎంతో చక్కగా, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. కానీ ఎవరు మనస్సులో ఏం ఉందో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారు చెప్పలేము. ఇలా తెలిసిన వారి చేతిలో చాలామంది.. తమ డబ్బులు, ఆస్తులు అన్ని కోల్పోయి రోడ్డుపై పడుతున్నారు. మరికొందరు అధిక వడ్డీ వస్తుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోతుంటారు. తాజాగా ఓ మహిళ అలానే మోసపోయింది. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బులు వస్తాయంటూ చెప్పి రూ.5కోట్లు మోసం చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు లోని మరైమలర్ నగర్ ప్రాంతానికి చెందిన శివశంకరి(32) అనే మహిళ జూలై 23న తాంబరం పోలీస్ కమిషన రేట్ ఆఫీస్ లో ఓ ఫిర్యాదు చేసింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం..శివశంకరి ఇంటికి సమీపంలో కామాక్షి అనే మహిళ, తన భర్త, మామతో కలిసి నివాసం ఉంటుంది. కామాక్షి భర్త అతి తెలివి ప్రదర్శించాడు. అతడు తన భార్య అందాన్ని పెట్టుబడిగా పెట్టాలని భావించాడు. కామాక్షి కూడా అందంగా హుందాగా కనిపిస్తూ ఉండటంతో శివశంకరి భర్తతో సహా అందరూ వీరిని నమ్మేశారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు షేర్ మార్కెట్ కి సంబంధించిన విషయాలను శివశంకరికి కామాక్షి చెప్తుండేది. అలా ఓ సారి కామాక్షితో పాటు ఆమె భర్త, మామ, మరిది షేర్ మార్కెట్లో డబ్బు పెట్టడం వల్ల తక్కువ కాలంలో రూ.లక్షల్లో సంపాదించవచ్చని శివశంకరిని నమ్మించారు. దీంతో వారి మాటలు నమ్మిన శివశంకరి మొదట రూ.16.50 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. అనంతరం శివశంకరి కుటుంబం విడతల వారిగా రూ. 5 కోట్ల వరకు కామాక్షి కుటుంబ సభ్యులకు అందించింది. అయితే ఒకే ఒక్కసారి మాత్రమే డివిడెంట్ రూపంలో ఆమెకి రూ.50 వేలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో మోసపోయాని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరింది. దీంతో కమిషనర్ ఆదేశం మేరకు కేసు నమోదు చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో కామాక్షి కుటుంబం రూ.5 కోట్ల మేర మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు కామాక్షితో పాటు, విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: లాక్డౌన్లో రైతు కూలీలను విమానంలో స్వస్థలాలకు పంపిన రైతు.. గుడిలో ఆత్మహత్య చేసుకుని.. ఇదీ చదవండి: లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును ప్రియురాలి ఖాతాలో జమ చేసిన ప్రభుత్వ ఉద్యోగి..