ఈ రోజుల్లో అందమైన అమ్మాయి కంటికి కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మాయమాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకుంటారు. ఇక ప్రేమా, దోమా అంటూ చెప్పులు అరిగేలా వెంట తిరిగి చివరికి తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. అంతటితో ఆగుతారా అంటే అదీ లేదు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ రెండు సినిమా డైలాగులో వదిలి శారీరక కోరికలు తీర్చుకుని చివరికి కాదు పొమ్మంటున్నారు.
సరిగ్గా ఇలాంటి మార్గంలోనే అడుగులేశాడో కీచక డాక్టర్. చేయాల్సినవి అన్నీ చేసి.., పెళ్లి మాట ఎత్తేసరికి భౌతిక దాడికి దిగుతున్నాడు. దీనిని భరించలేని ఆ యువతి ఏకంగా పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ వేడుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి హిమాయత్ నగర్ లో ఉన్న ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. అయితే అదే ఆస్పత్రిలో కోటం సందీప్ భరద్వాజ్ అనే యువకుడు డాక్టర్ గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే నర్సుగా పని చేస్తున్న ఆ యువతిపై కన్నేశాడు. ప్రేమా, గీమా అంటూ తెగ తిరిగాడు. మనోడి అమాయకపు మాటలు విన్న ఆ యువతి అతని ప్రేమకు తలొగ్గింది. దీంతో ఇదే అదునుగా భావించిన ఈ కీచక వైద్యుడు నైట్ డ్యూటీకి రమ్మని చేయాల్సినవి అన్ని చేసేవాడు. ఇంతటితో ఆగక నమ్మంచి తన ఫ్లాట్ కు తీసుకెళ్లి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడేవాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయింది.
ఆ యువతి ఇంటికి వెళ్లడంతో ఆ డాక్టర్ బాబు ఫోన్లు చేసి నగరానికి రావాలంటూ వేధించేవాడు. ఇక హైదరాబాద్ కు రాగానే తన ప్లాట్ లో ఉంచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సందీప్.., ఇటీవల ఆ యువతి పెళ్లి ప్రస్తావన తేగానే నేను చేసుకోనంటూ పెదవి విరిచాడు. వీడి మాటలు విన్న ఆ యువతి ఇతగాడికి సరైన బుద్ది చెప్పేలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పండగపూట పట్టలేని ఆనందం.. అంతలోనే ఊహించని విషాదం