ఈ మద్య మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. అయితే.. పురుషులు కూడా కొంత మంది మహిళల ఉచ్చులో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు.. వారు చేసే బ్లాక్ మెయిలింగ్ కి బెంబెలెత్తిపోతున్నారు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ యువకుడిని తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపించి డబ్బు వసూళ్లు చేసేందుకు ప్రయత్నించిన ఓ నటి పై కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో ఉంటున్న ఓ నటుడు యువరాజ్ కుమార్ రెజెటికి ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పడాల లక్ష్మి ఓ వీడియో షేర్ చేసింది. రెండు సంవత్సరాల క్రితం యువరాజ్ కుమార్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలిసి ఉన్న సమయంలో చాటుగా తీసిన వీడియోని లక్ష్మ పంచించడమే కాదు.. తనకు వెంటనే రూ. 5 లక్షలు ఇవ్వాలని లేకుంటే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిచింది. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే నీకే నష్టం అని వార్నింగ్ ఇచ్చింది.
సత్యం థియేటర్ వద్దకు వచ్చి తనకు ఐదు లక్షల రూపాయాలు ఇచ్చి వెళ్లాల్సిందిగా యువరాజ్ కుమార్ కి చెప్పింది లక్ష్మి. దీంతో ఆమె టార్చన్ భరించలేక యువరాజ్ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పడాల లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: 20 ఏళ్ల యువతికి కోర్టు దారుణ శిక్ష.. రాళ్లతో కొట్టి చంపాలని తీర్పు!