Latest Crime News In Telugu: ఏదైనా తప్పు చేస్తే కోర్టు శిక్ష విధించటం సర్వసాధారణం. చేసిన తప్పును బట్టి శిక్ష తీవ్రతలో మార్పు ఉంటుంది. చిన్న తప్పుకు చిన్న శిక్ష.. పెద్ద తప్పుకు పెద్ద శిక్ష ఉంటుంది. అయితే, కోర్టు కొన్ని సార్లు చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు విధిస్తుంటుంది. ఇది ఆయా దేశాల ఆచార, సంప్రదాయాలు, కట్టు బాట్ల మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా, ఓ కోర్టు అక్రమ సంబంధానికి దారుణమైన శిక్ష విధించింది. ఓ యువతిని రాళ్లతో కొట్టి చంపాలని తీర్పు నిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సూడాన్‌లోని వైట్ నైల్ స్టేట్‌కు చెందిన మరియామ్ అల్‌సైద్ టియ్‌రబ్ అనే 20 ఏళ్ల యువతిని అక్రమ సంబంధం కొనసాగిస్తోందంటూ గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 26న ఆమెను కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన కోస్టి క్రిమినల్ కోర్టు ఆమెకు దారుణమైన శిక్ష విధించింది. రాళ్లతో కొట్టి చంపాలని తీర్పు నిచ్చింది. ఈ తీర్పుకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
అయితే, ఈ తీర్పుపై మరియామ్ ఉన్నత న్యాయస్థానానికి వెళతానని చెబుతోంది. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారంటోంది. కోస్టి కోర్టు తీర్పును మానవ హక్కుల సంఘం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా, మరియామ్ కొన్ని నెలల క్రితం భర్తతో విడిపోయి పుట్టింటికి వచ్చేసింది.
పుట్టింటి దగ్గర ఉంటున్న మరియామ్ అక్రమ సంబంధం కొనసాగిస్తోందంటూ గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వివాహేతర సంబంధానికి మరణ శిక్ష విధించటం సూడాన్‌లో పదేళ్ల తర్వాత ఇదే మొదటిది కావటం విశేషం. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మగ బిడ్డ కోసం పూజలు! ఆ కోరిక తీరిందని మరో బిడ్డని బలి ఇచ్చాడు!