సాధారణంగా ప్రతీ ఒక్కరు జ్వరంతో బాధపడినా లేక ఆరోగ్యం సరిగ్గా లేదనిపించిన వెంటనే గ్లూకోజ్ పౌడర్ తాగి కాస్త ఉపశమనం పొందుతారు. అయితే ఓ మహిళ సరిగ్గా ఇలాంటి జ్వరం లాంటి లక్షణాలు కనిపించడంతో గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఏకంగా ఎలుకల మందు తాగిన ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గండ్రకోట రేణుక(47) జ్వరంతో బాధపడుతోంది. అయితే ఈ క్రమంలోనే రేణుక ఇంట్లో ఉన్న గ్లూకోజ్ పౌడర్ అనుకుని కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగింది. అయితే తాగినప్పుడు బాగానే ఉన్న మరుసటి రోజు మాత్రం కాస్త తేడా అనిపించి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఆ మహిళ గ్లూకోజ్ కు బదులుగా ఎలుకల మందు తాగిందని వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా రేణుక చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మొన్నటి వరకు మాతో పాటు ఉండి ఉన్నట్టుండి మరణించడంతో రేణుక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఎలుకల మందు తాగి ప్రాణాలు కోల్పోయిన రేణుక మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కల్తీ మద్యం సేవించి 18 మంది కూలీలు మృతి!