ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పాటు ఓ సెల్ఫీ వీడియోను తీసుకుని అందులో సంచలన నిజాలు బయటపెట్టాడు.
హన్మకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి తనని కాదని మరో యువకుడితో తిరుగుతుందని తెలిసి యువకుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ యువకుడి ఓ సెల్ఫీ వీడియో తీసుకుని అందులో సంచలన నిజాలు బయటపెట్టాడు. ఆ వీడియో చూసిన అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామం. ఇక్కడే సాయి చంద్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు గత కొంత కాలంగా స్థానికంగా ఓ హోటల్ ను నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సాయిచంద్ ఇదే గ్రామానికి చెందని ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమించింది. దీంతో ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమ విహారంలో తేలియాడారు. సాయిచంద్ ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆ అమ్మాయి సాయిచంద్ ని కాదని మరో యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న సాయి చంద్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతడు దీని కంటే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఏముందంటే? జులైవాడకు చెందిన గిన్నె విష్ణువర్ధన్ అనే వ్యక్తి ఈ నెల 17న ఆ అమ్మాయి ఉండే ప్రాంతానికి నన్ను పిలిపించుకుని నాపై దాడి చేశారు. దీంతో పాటు బాగా టార్చర్ చేశారని సాయి చంద్ సెల్ఫీ వీడియోలో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారిని పిలిపించి ఎంక్వయిరీ కూడా చేయలేదని తెలిపాడు. ఇక శనివారం నేను ప్రేమించిన అమ్మాయి బర్త్ డే అని, అందుకే ఈ రాత్రి 12 గంటలకు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నా అన్నాడు.
ఎందుకుంటే ఆమే ప్రతీ ఏడాది చేసుకునే పుట్టిన రోజున నా చావు రోజని ఆమెకు గుర్తు రావాలని సాయి చంద్ తెలిపాడు. నేను చనిపోయాక నా శవాన్ని ఆ అమ్మాయికి చూపించండి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అక్క, బావా, అమ్మ, నాన్న నన్ను క్షమించండి, మీ అందరినీ మిస్ అవుతున్నా.. వాళ్లిద్దరినీ మాత్రం అస్సలు వదలొద్దు అంటూ సాయి చంద్ తన సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.