లంగాణలో పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. హన్మకొండలో హిందీ ప్రశ్నపత్రంలో హరీష్ అనే విద్యార్థి పేరు బయటకు వచ్చింది. తాజాగా అతడి ఫలితాల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. హన్మకొండలో హిందీ ప్రశ్నపత్రంలో హారీష్ అనే విద్యార్థి పేరు బయటకు వచ్చింది. అతడిపై పదో తరగతి బోర్డు సీరియస్ అయింది. అప్పట్లో కోర్టు అదేశాలతో హారీష్ తిరిగి పరీక్షలు రాశాడు. అయితే తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో హరీష్ విషయంలో అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులు షాకయ్యారు.
బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో హన్మకొండ పేపర్ లీక్ కేసులోని విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్ లో అధికారులు. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ లో ఎంజేపీ విద్యార్థి దండెబోయిన హరీష్ పదో తరగతి చదువుతున్నాడు. హిందీ పరీక్ష పేపర్ ఇతని వద్ద నుంచి నిందితులు ఫొటోలు తీసుకున్నారు. హారీష్ దగ్గర ఉన్న హిందీ ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసుకొని నిందితులు వాట్సాప్ పెట్టారు. ఈ విషయం గుర్తించిన అధికారులు ఐదేళ్ల పాటు హరీష్ పరీక్షలు రాయకుండా డీబార్ చేశారు.
అధికారులు తీసుకున్న నిర్ణయంపై అతడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యాశాఖ అధికారులు విధించిన డీబార్ ను ఎత్తివేసింది. హరీష్ ను పదో పరీక్షలకు అనుతించాలని కోర్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో తిరిగి హరీష్ పరీక్షలు రాశాడు. అయితే బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో హరీష్ ఫలితాలు రాలేదు. హరీష్ ఫలితాలు ప్రకటించకుండా అధికారులు హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. హరీష్ ఫలితాలను ప్రకటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎన్ఎస్ యూఐ నేతలు కలిశారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.