బ్యాంకులో దొంగతనం, ఇంట్లో దొంగతనం, నగల షాపులో దొంగతనం జరగడం విన్నాం. కానీ పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరగడం ఎప్పుడైనా విన్నారా? వినటానికి షాకింగ్ గా ఉన్న ఈ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరగడం ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ దొంగలు ఏం ఎత్తుకెళ్లారనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. అది గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలోని విర్సాద్ పోలీస్ స్టేషన్. ఇక్కడే నిత్యం నేరస్తులతో ఆ పోలీస్ స్టేషన్ కలకలలాడుతుంటుంది.
అయితే గతంలో పోలీసులు భారీగా సీజ్ చేసిన గంజాయిని స్టేషన్ లోని ఓ గదిలో ఉంచారు. కాగా శనివారం రోజున అదే స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తున్న శోభనా వాఘేలా సీజ్ చేసిన గంజాయిని పరిశీలించేందుకు వెళ్లింది. కానీ అక్కడ సీజ్ చేసిన గంజాయి కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె స్టేషన్ లోని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.ఈ వార్త తెలుసుకున్న పోలీసలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక అనంతరం ఆమె ఫిర్యాదులో.. గంజాయి స్టాక్ ఉంచిన రూమ్ కు ఉన్న కిటికిని పూర్తిగా తొలగించి ఆ తర్వాత కిటికి పక్కనున్న ఇటుకలను పూర్తిగా తీసేశారు. అదే రూమ్ లో ఓ బ్యాగు కూడా కనిపించింది.
ఇక ఆ ఆ రూమ్ లోకి వెళ్లిన దొంగలు.. సుమారు రూ. 8,60,000 విలువైన 144 కిలోల గంజాయిని దొంగిలించారని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతన్నారు. ఇక ఇదే విషయాన్ని ఆ స్టేషన్ పోలీసులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ గంజాయి దొంగతనంపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరు? అనే అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే రక్షణ కల్పించిన పోలీస్ స్టేషన్ కే రక్షణ లేకపోవడంతో సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని స్థానికలు అభిప్రాయపడుతున్నారు.