ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా బద్వెల్ లోని అనూష అనే డిగ్రీ విద్యార్థి కనిపించకుండా పోయింది. ఇక మూడు రోజుల తర్వాత అనూష పెన్నా నది ఒడ్డున శవమై కనిపించిన విషయం తెలిసిందే. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనూష శవం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో పోలీసులు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇక అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు కింద కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలు కాలేజీకి వెళ్లిన అనూష ఎక్కడికి వెళ్లింది? ఆమెకు ఎవరితోనైనా పరిచయాలు ఉన్నాయా? అనే కోణంలో విచారించారు. అయితే తాజాగా అనూష మరణానికి కారణం అయిన గురు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సంచలన నిజాలు వెల్లడించారు. అనూషకు గురు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో సంబంధం ఉంది. అయితే వీరిద్దరు కలిసి ఈ నెల 19న బైక్ పై సిద్దవటం కోటకు వెళ్లి వచ్చారు. ఇక మరుసటి రోజు తన పుట్టిన రోజు కావడంతో అనూషను మళ్లీ సిద్దవటం కోటకు తీసుకొచ్చేందుకు గురు మహేశ్వర్ రెడ్డి పథకం రచించాడు.
అయితే గురు మహేశ్వర్ రెడ్డి ప్లాన్ కుదరకపోవడతో అనూష సోదరికి చెప్పి ఒప్పించమని సూచించాడు. ఆమె సోదరి చెప్పినట్లుగా.. అనూష ఈ నెల 20న బస్సులో బద్వెల్ లు చేరుకుని అటు నుంచి నేరుగా సిద్దవటం కోటకు చేరుకుందని ఎస్పీ వివరించారు. అయితే అనూష అక్కడికి చేరుకున్నాక తానే అందులో దూకిందా? లేక ఎవరైన తోసేశారా అనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక అనూష మరణానికి కారణమైన గురుమహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో రానున్న రోజుల్లో మరిన్ని నిజాలు రావచ్చని తెలుస్తోంది.