ఆమెకు ఇది వరకే పెళ్లైంది. భర్తతో తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపుతుంది. ఆమె కాపురం ఆనందంగా సాగుతున్న క్రమంలోనే భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవించి ఆ తర్వాత ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే అదే యువకుడి చేతిలో చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత జైలు జీవితం గడిపిన రెండో భర్త అదే జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఏం జరిగిందంటే? అది కర్ణాటకలోని గంగావతి జిల్లా మార్లనపల్లి గ్రామం. ఇక్కడే సవిత, రవి దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల అన్యోన్య జీవితం సంతోషంగా సాగుతుంది.
ఈ క్రమంలోనే భర్త అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణించడతో సవిత స్థానికంగా ఓ స్కూల్లో పనికి కుదిరింది. అదే స్కూల్లో ఆనంద అనే యువకుడు స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక ఒకే స్కూల్లో ఇద్దరు పని చేస్తుండడంతో ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు ఇద్దరు ప్రేమ విహారంలో తేలియాడుతూ జీవితాన్నినెట్టుకొస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని సవిత తన తల్లిదండ్రులకు చెప్పింది. నేను అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సవిత తల్లిదండ్రులు సైతం అంగీకరించాడు. ఇక యువకుడు కూడా అతని తల్లిదండ్రును ఒప్పించాడు. దీంతో ఇద్దరు బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అలా వీరి కాపురం సంతోషంగా సాగుతున్న క్రమంలోనే సవితకు గతంలో పెళ్లి జరిగిందనే విషయం భర్త ఆనందకు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆనంద తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. అలా కొన్నాళ్లకి అది మరిచిపోయిన రెండో భర్త ఆనంద భార్య సవితపై అనుమానించడం మొదలు పెట్టాడు. నీకు మరొక మగాడితో సంబంధాలు ఉన్నాయంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఇక ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే ఇటీవల ఇదే విషమంపై ఈ దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్య సవితను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై స్పందించి అతనిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత జైలు జీవితాన్ని గడుపుతూ ఆనంద జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.