వరసకు బావ. పైగా పోలీస్. ఈ కారణంతోనే మరదలు కాస్త భయంతో కూడిన మర్యాదతో మెలిగేది. దీనినే ఆసరాగా చేసుకున్న ఈ దుర్మార్గుడు మరదలిపై ఓ కన్నేశాడు. కన్నేశాడు అంటే కనిపెట్టడం అని కాదు. మరదలిని లైంగికంగా వేధించడం. దీంతో బావ అనేక సార్లు మరదలిని బలవంతంగా అత్యాచారం చేస్తూ ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. దీంతో తట్టుకోలేని యువతి గతంలో పోలీస్ బావకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే తాజాగా అదే యువతి పోలీసులు సైతం నోరెళ్లబెట్టేలా షాక్ ఇచ్చింది. తాజాగా కర్నాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటకలోని చెల్లకేరిలో ఉమేష్ అనే వ్యక్తి పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతను గతంలో దావణగెరె పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అతని మేనమామ ఉమేష్ వద్దకు వచ్చిన తన భూ సమస్యలను పరిష్కరించాలని కోరాడు. దీంతో మేనమామ కోరినట్లు ఉమేష్ అతనికి సాయం చేశాడు. ఆ సమయంలోనే మేనమామ కూతురిపై ఉమేష్ కన్నేశాడు. దీంతో వీలు కుదిరినప్పుడల్లా మరదలిపై బలవంతంగా అత్యాచారం చేసేవాడు. దీంతో అలా బావ పలుమార్లు అత్యాచారం చేయడంతో యువతి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సార్లు గర్భం దాల్చింది.
దీంతో ఆ యువతికి ఐదు సార్లు బావ అబార్షన్ చేయించాడట. బావ దారుణాన్ని తట్టుకోలేకపోయిన మరదలు గతంలో బావ ఉమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు ఉమేష్ ను విధుల నుంచి తొలగించారు. కట్ చేస్తే తాజాగా అదే యువతి మళ్లీ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ సారి సీన్ మారింది. నా బావపై నేను ఫిర్యాదు చేసింది అంతా అవాస్తవమని, నా మనసిక స్థితి బాగలేని కారణంగానే అతనిపై ఫిర్యాదు చేశానని ఫిర్యాదు పేర్కొంది. యువతి ఫిర్యాదుతో పోలీసులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. గతంలో అలా, ఇప్పుడు ఇలా ఏంటని పోలీసులు తలలు పట్టుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.