ఈ మద్య కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు కారణాలు కొన్ని అయితే.. వరకట్నం, ప్రేమ వ్యవహారాలు మరికొన్ని అవుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లికి వచ్చిన బంధువుమిత్రులు ఏదేం చోద్యం అంటూ వెనుతిరిగిపోతున్నారు.
ఈ మద్య పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది సేపట్లో వివాహం జరగబోతుందన్న సమయంలో ఎదో ఒక అవాంతరం ఏర్పడటంతో పెళ్లి పెటాకులైపోతున్నాయి. కట్నం కోసం, ప్రేమించిన వారికోసం, వరుడు మద్యం సేవించాడని.. వధువు రంగు బాగాలేదని.. అనుకోకుండా ఇరు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చనిపోవడం వల్లనో.. ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు ఎంతో వైభవంగ జరగాల్సిన పెళ్లి అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. ఇంతకీ ఆ వరుడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?.. వివరాల్లోకి వెళితే..
ఈ మద్యనే లక్ష్మీగూడకు చెందిన తుమ్మల ఫృథ్విరాజ్ అనే యువకుడికి మంచిరేవులకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఓ ఫంక్షన్ హాల్ లో వివాహానాకి అన్ని ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా విచ్చేశారు. పెళ్లి వేడుక ఎంతో కోలాహలంగా మారింది.. కొద్ది సేపట్లో పెళ్లి కూతురు మెడలో తాలికట్టేందుక వరుడు సిద్దమయ్యాడు.. అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. పెళ్లికొడుకు ఫృథ్విని కుటుంబ సభ్యులు, బంధువుల ముందే అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకు వెళ్లారు పోలీసులు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారని బంధువులు ఆరాతీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పృథ్వీరాజ్ గతంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మిన ఆ యువతి సర్వస్వం అర్పించుకుంది. కానీ కొంత కాలంగా పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తే దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. అంతేకాదు ఆ యువతిని దారుణంగా మోసం చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఫృథ్వి. తనకు ఎన్నో ఆశలు చూపించి మరో యువతితో వివాహం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు స్వీకరించి అతన్ని పెళ్లి మండపంలోనే అరెస్ట్ చేశారు అమైలార్‌దేవ్‌పల్లి పోలీసులు. ఇదిల ఉంటే ఫృథ్వి ఆస్తులపై కన్నేసిన యువతి కావాలనే ఈ విధంగా తప్పుడు కేసు పెట్టి తమ కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేయించిందని పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.