అతడో సీరియల్ కిల్లర్. అతడికి రూ.500 అవసరమైతే చాలు ఒక ప్రాణం పోయినట్లే. మద్యం, గంజాయి కొనేందుకు రోడ్లపై అన్వేషిస్తాడు. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటాడు. అలా రెండు వారాల గ్యాప్‌లో ముగ్గుర్ని హతమార్చాడు.
యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తుండటం గురించి వార్తల్లో చూస్తున్నాం. యువతను గంజాయి మత్తుకు అలవాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఈ ముఠాల ఆగడాలు ఈమధ్య పెరిగిపోయాయి. దీనికి తాజా ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ మద్య కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు కారణాలు కొన్ని అయితే.. వరకట్నం, ప్రేమ వ్యవహారాలు మరికొన్ని అవుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లికి వచ్చిన బంధువుమిత్రులు ఏదేం చోద్యం అంటూ వెనుతిరిగిపోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై ఇద్దరు మృతి చెందగా.. మరో పదిమందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి మొఘల్స్ కాలనీలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. నిన్న మొహ్మద్ ఖైసర్ అనే యువకుడు మరణించగా, నేడు ఆఫ్రీన్ సుల్తానా (22) మృతి చెందింది. ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజాబేగం(6నెలలు) పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రీన్ సుల్తానాకు […]
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకుని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. సమాజం అంగీకరించకపోయినా కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఒకే తాడుతో ఉరేసుకుని ప్రాణాలు వదిలి జీవితాన్ని ముగించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ కు చెందిన రవి, అనూష అనే ఇద్దరు కుటుంబాలు గత కొంత కాలం నుంచి మైలార్ దేవ్ పల్లి […]
రంగారెడ్డి జిల్లా పరిధి మైలార్ దేవ్ పల్లిలో పేలుడు సంభవించింది. ఆ పేలుడో ఓ మహిళ గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. చెత్తకుప్పలో చిత్తుకాగితాలు సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రసాయనాల వల్లే ఈ పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్ దేవ్ పల్లి పరిధిలో దంపతులు చెత్తకాగితాలు ఏరుకునేందుకు వెళ్లారు. అక్కడ ఓ చెత్తకుప్పలో కాగితాలు ఏరుతండగా పేలుడు సంభవించింది. […]