రంగారెడ్డి జిల్లా పరిధి మైలార్ దేవ్ పల్లిలో పేలుడు సంభవించింది. ఆ పేలుడో ఓ మహిళ గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. చెత్తకుప్పలో చిత్తుకాగితాలు సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రసాయనాల వల్లే ఈ పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. మైలార్ దేవ్ పల్లి పరిధిలో దంపతులు చెత్తకాగితాలు ఏరుకునేందుకు వెళ్లారు. అక్కడ ఓ చెత్తకుప్పలో కాగితాలు ఏరుతండగా పేలుడు సంభవించింది. ఆ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి రసాయనాలను అక్కడ పడేసినట్ల అనుమానిస్తున్నారు. వాటిని తీసిన క్రమంలోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన శంషాబాద్ డీసీపీ జగదీశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘనటపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.