చక్కని ఉద్యోగం.. మంచి భర్త.. సంతోషంగా సాగుతున్న సంసారం. ఎంతో ఆనందంగా ఉన్న పచ్చని సంసారంలో తనే నిప్పులు పోసుకుంది ఓ ఇల్లాలు. భర్త ఉండగానే మరో మగాడితో సహజీవనం చేసింది. కొన్ని నెలలుగా వారి సంబంధం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లింది. భర్త మంచి తనాన్ని చేతగానీ తనంగా భావించిన భార్య ఓ అడుగు ముందుకు వేసింది. ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరు.. దానికి తగ్గట్లుగానే పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. మూడు రాత్రులు హోటల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే హోటల్ లో దిగారు.. ఎంజాయ్ చేశారు. కానీ.. ఇక్కడే అసలైన కథ మెుదలైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ ప్రాంతానికి చెందిన రచన-రాజ్ కుమార్ లు భార్యభర్తలు. రచన(44) ఓ ప్రవేట్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తుంటే.. భర్త కూలీ పనులకు వెళ్తుండేవాడు. అయితే ఈ క్రమంలోనే రచనకు కొన్ని నెలల క్రితం బిహార్ స్టేట్ భోజ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గౌతమ్(34)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త విహహేతర సంబంధానికి దారితీసింది. దాంతో ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లి కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దాంతో డిసెంబర్ 23న వీరిద్దరు మీరట్ లో కలుసుకోవాలి అనుకున్నారు. అక్కడే హోటల్ లో రెండు రాత్రులు గడిపి తర్వాత ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇద్దరు హోటల్ లోకి వచ్చారు.
ఇక సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు గౌతమ్ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో.. హోటల్ సిబ్బంది మధ్యాహ్నం గదిలోకి వెళ్లి చూడగా రచన విగతజీవిగా పడిఉంది. దాంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కేవలం 24 గంటల్లోనే నిందితుడు గౌతమ్ ను మురాద్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. రచనతో నాలుగు నెలలుగా సంబంధం ఉందని, హోటల్ లో తనతో కలిసి రాత్రి ఉండేందుకు ఒప్పుకోలేదని, ఇంటికి వెళ్తానని గొడవ పెట్టుకోవడంతోనే తనను గొంతు నులిమి చంపానని గౌతమ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఆదివారమే హత్య చేసి రాత్రి మెుత్తం అదే గదిలో ఉన్నట్లు తేలింది. దాంతో అతడిపై ఐపీసీ 302, 506 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.