ఈ రోజుల్లో ఎంతో మంది మహిళలు చేయని పనికి భర్త చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కట్టుకున్న భార్య పరాయి మగాళ్లతో తిరుగుతుందన్న కారణంతో భర్తలు తెగించి భార్యలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త కసాయిగా మారి కట్టుకున్న భార్య అని కనికరం మరిచి హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా భార్య శవాన్ని నీటి సంపులో పూడ్చి పెట్టాడు. గద్వాల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల్ పట్టణంలోని పిల్లిగుండ్ల ప్రాంతంలో గోవిందమ్మ (42), బుచ్చన్న దంపతులు నివాసం ఉంటున్నారు. బుచ్చన్న మల్దికల్ లో గొర్రెల కాపరిగా పని చేస్తుండగా.., భార్య స్థానికంగా పని చేస్తుండేది. అయితే గత కొంత కాలం నుంచి భర్త బుచ్చన్న భార్య గోవిందమ్మపై అనుమానం పెంచుకున్నాడు. నా భార్య పరాయి మగాళ్లతో తిరుగుతుందన్న అనుమానం అతడికి రోజు వస్తుండేది. దీంతో తరుచు బుచ్చన్న భార్యతో గొడవ పడేవాడు. ఇదిలా ఉంటే ఈ నెల 17న భర్త బుచ్చన్న నీకు వచ్చిన జీతం డబ్బులు ఏం చేశావ్ అంటూ భార్యతో గొడవకు దిగాడు. ఇదే గొడవ రాను రాను ఇద్దరు మాటల దాడి చేసుకునే దాక వెళ్లింది.
దీంతో కోపంతో ఊగిపోయిన భర్త బుచ్చన్న భార్య గోవిందమ్మను దారుణంగా హత్య చేసి ఇంటి దగ్గర ఉన్న నీటి సంపులో పూడ్చి పెట్టాడు. ఇక రెండు రోజులైన గోవిందమ్మ ఆచూకి దొరకకపోవడంతో కూతురు తండ్రిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త బుచ్చన్నను విచారించగా సంచలన నిజాలు బయటపెట్టాడు. నా భార్యపై నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉందని, దీని కారణంగానే నా భార్యను హత్య చేసి ఇంటి దగ్గర ఉన్న నీటి సంపులోపూడ్చి పెట్టానని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నీటి సంపులోంచి గోవిందమ్మ అస్థిపంజరాన్ని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం భర్తపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుచ్చన్నను అరెస్ట్ దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.