ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. కారణాలు ఏమైనా అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వారు.. హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి తరలించే లోపే కన్నుమూస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా గుండెపోటు మరణాల వార్తలే వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా సృష్టించిన ప్రళయం గురించి తెలిసిందే. అప్పట్లో కరోనా పేరు చెబితే భయపడేవారు.. ఇప్పుడు గుండెపోటు, హార్ట్ ఎటాక్ పేరు వినిపిస్తే చాలు వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఏ క్షణంలో హార్ట్ ఎటాక్ వస్తుందో అన్న భయాందోళన ప్రజల్లో రోజు రోజుకీ పెరిగిపోతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉపాధి హామీ కూలీలతో పనిచేయిస్తున్న ఓ ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. సూర్యాపేట జిల్లా కోటపహాడ్ గ్రామానికి చెందిన మద్దెల యల్లయ్య వయసు 46 సంవత్సరాలు. సోమవారం మధ్యాహ్నం బొప్పారడం వద్ద ఉపాధి హామీ కూలీలతో రోడ్డు మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు. హఠాత్తుగా యల్లయ్య తనకు విపరీతంగా ఛాతి నొప్పి వస్తుందని అనడంతో కూలీలు ఆటోలో సూర్యపేట జనరల్ హాస్పిటల్ కి తరలించారు. కానీ మార్గమధ్యలోనే యల్లయ్య కన్నుమూశాడు.
గత ఎనిమిది సంవత్సరాలుగా ఆత్మకూర్ మండలం కోటపహాడ్ గ్రామ పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యల్లయ్య గౌడ్ అందరితో కలివిడిగా ఉండేవారని.. సోమవారం కూడా మధ్యాహ్నం వరకు అందరితో మాట్లాడుతూ హఠాత్తుగా తనకు ఛాతి నొప్పి వస్తుందని బాధపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూశాడని సన్నిహితులు కన్నీరు పెట్టుకున్నారు. యల్లయ్య గౌడ్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. అధికారుల, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటుతో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.