తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుతో మంత్రి కేటీఆర్‌కు లింకు ఉందని, అందుకే సరైన విచారణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపిస్తూ శుక్రవారం ఈడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులను ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ తారాలతో కేటీఆర్ మంచి సంబంధాలు ఉన్నాయని, డ్రగ్స్ కేసులో వెలుగులోకి మత్తు పదార్థలు మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ తయారు కావని, విదేశాల నుంచి మాత్రమే మన దగ్గరు వచ్చాయని, వాటిని సినీ తారాలకు అందేలా ఆయన సహకరించారని సంచలన ఆరోపణలు చేశారు. నాలుగేళ్ల క్రితం నమోదైన డ్రగ్స్ కేసు రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. కేటీఆర్‌కు డ్రగ్స్ వ్యవహారంతో పాటు మనీ లాండరింగ్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇతర రాష్ట్రాలు, దేశాల అధికార పర్యటనలతో పాటు వ్యక్తిగత టూర్లపై కూడా విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఈడీ స్వీకరించింది.