దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు అందించారు. ఇందులో అఫ్తాబ్.. సహజీవనం చేస్తున్న ప్రియురాలు(శ్రద్ధ)ని అత్యంత పాశవికంగా ఎందుకు హత్య చేశాడు..? అనంతరం శరీరాన్ని 35 ముక్కలుగా చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది..? హత్య జరిగిన అనంతరం ఎలా ఉండేవాడు..? ఇలా ప్రతి విషయాన్ని పోలీసులు చార్జిషీట్‌లో ప్రస్తావించారు. 6629 పేజీల ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు పోలీసులు. ఒళ్లుగగుర్పాటు కలిగించే ఈ సంఘటన మే 18, 2022న జరిగితే, దాదాపుగా ఆరు నెలల తరువాత శ్రద్ధావాకర్ తండ్రి కూతురి వాకబు చేయడంతో ఈ హత్య విషయం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో పోలీసుల ఛార్జిషీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రద్ధాను హత్య చేసిన అనంతరం ఆమె ఎముకలనను పౌడర్ చేసేందుకు అఫ్తాబ్ యత్నించినట్లు పోలీసులు ఛార్జీషీట్ లో వెల్లడించారు. ‘ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను సుత్తితో కొట్టి చంపినట్లు.. అనంతరం శరీర భాగాలను 3 పదునైన కత్తుల సాయంతో 35 భాగాలుగా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె వేళ్లను బ్లోటార్స్ తో కత్తిరించినట్లు పొందుపరిచారు. అలాగే, ఎముకలను గ్రైండర్ లో పొడి చేసి ఆ పౌండర్ అడవిలో చల్లినట్లు..’ అని పోలీసులు ఛార్జీషీట్ లో వెల్లడించారు. ఈ కేసులో 6600 పేజీల ఛార్జిషీట్ ఫైల్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ కు పోలీసులు పాలిగ్రాఫ్, నార్కో-అనాలిసిస్ టెస్టులు నిర్వహించారు. ఈ రెండిటిలో కూడా శ్రద్ధా వాకర్ ని హత్య తానే హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.
Shraddha Walker Murder Case: Delhi Court Takes Cognizance of Chargesheet Filed Against Accused Aaftab Poonawalahttps://t.co/RhLGLox94U pic.twitter.com/iIuaDozzyE
— Shining India News (@shiningindnews) February 7, 2023
ఢిల్లీకి మకాం మార్చకముందే శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ పూనావాలా సహజీవనం చేసేవారు. ఆమె హత్య జరగడానికి కొద్ది రోజుల ముందే ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లడం జరిగింది. అక్కడకు వెళ్లిన అనంతరం ఇద్దరి మధ్య మనస్ఫర్థల కారణంగా నిత్యం గొడవపడేవారట. ఈ క్రమంలో ఆమె తనను విడిచిపెట్టి వెళ్ళిపోతుందని హత్యచేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. మే 18 న శ్రద్ధాను అఫ్తాబ్ హత్య చేశాడు. శద్ధా ఛాతిపై కూర్చోని, చనిపోయే వారకు గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని 35 భాగాలుగా చేయడం, రక్తాన్ని శుభ్రం చేయడానికి రెండు 500 ఎంఎల్ హార్పిక్ బాటిళ్లను, చాపింగ్ బోర్డు వంటి ఇతర వస్తువులను బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసినట్లు పోలీసులు ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. అలాగే, అఫ్తాబ్‌పై జరిపిన నార్కో అనలిస్ట్ పరీక్ష, పాలీగ్రామ్ పరీక్ష, డీఎన్ఏ సాక్షాలను కూడా పోలీసులు ఛార్జిషీటులో ప్రస్తావించారు.