దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు అందించారు. ఇందులో అఫ్తాబ్.. సహజీవనం చేస్తున్న ప్రియురాలు(శ్రద్ధ)ని అత్యంత పాశవికంగా ఎందుకు హత్య చేశాడు..? అనంతరం శరీరాన్ని 35 ముక్కలుగా చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది..? హత్య జరిగిన అనంతరం ఎలా ఉండేవాడు..? ఇలా ప్రతి విషయాన్ని పోలీసులు చార్జిషీట్‌లో ప్రస్తావించారు. 6629 పేజీల ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు పోలీసులు. […]