ఇంటర్ కుర్రాడితో ప్రేమాయణం నడిపిన టీచరమ్మ అతడి ప్రాణాలను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. మూడేళ్లపాటు బాధితుడితో సుఖాలు తీర్చుకున్న సదరు టీచర్.. పెళ్లి గుర్తుకురాగానే బాధితుడిని పక్కనపెట్టింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యువకుడు(కృష్ణకుమార్(17)) ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా, ఆ టీచరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సమాచారం ప్రకారం.. ప్రాణాలు తీసుకోవడానికి ముందు కృష్ణకుమార్ పైచదువులు చదవడానికి అడ్మిషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు, అంబత్తూరులో షర్మిల అనే యువతి స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అదే సమయంలో స్కూల్ లో పాఠాలు చేబుతూనే సాయంత్రం తన ఇంటి వద్ద ట్యూషన్ కూడా చెబుతోంది. దీంతో గ్రామంలోనే చాలా మంది పిల్లలు ట్యూషన్ కు వచ్చేవారు. అందరిలానే.. కుల్లికుప్పం ప్రాంతానికి చెందిన కృష్ణకుమార్(17) అనే ఇంటర్ యువకుడు సైతం షర్మిల వద్దకు ట్యూషన్ కు వస్తుండేవాడు. ఈ క్రమంలో టీచరమ్మ కృష్ణకుమార్ తో ప్రేమలో పడింది. అలా కొంత కాలానికి ఆ కుర్రాడు సైతం టీచర్ ప్రేమలో పడిపోయాడు.
దీంతో ఇద్దరు కలిసి కొన్నాళ్ల పాటు ప్రేమాయణాన్ని బాగానే సాగించారు. కట్ చేస్తే ఇటీవల కాలంలో ఈ యువతికి ఇంట్లో పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఇదే ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి తెలియకుండా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకునేందుకు షర్మిల కూడా రెడీ అయింది. దీంతో బాధిత యువకుడిని కలవడం, మాట్లాడడం పూర్తిగా మానేసింది. చివరికి ఆ కుర్రాడికి తెలిసింది ఏంటంటే? తన ప్రియురాలు మరొకడితో పెళ్లికి సిద్దపడుతుందని. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనర్ బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ‘నా ప్రియురాలు లేని ఈ బతకు నాకొద్దు..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.