ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇదే చీకటి సంసారం చివరికి బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని ఓ భార్య పరాయి మాగాడితో ఏకాంతంగా బెడ్ రూంలో కునుకింది. వెంటనే ఎంట్రీ ఇచ్చిన భర్త ఈ సీన్ చూసి తట్టుకోలేక ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతాండ. ఇదే ప్రాంతంలో స్వామి నాయక్, మంగమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. భర్త స్వామి నాయక్ హైద్రాబాద్ లో కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్త అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. స్వామి నాయక్ నగరంలో ఉండడంతో భార్య మంగమ్మ పిల్లలతో ఉండేది. ఈ క్రమంలోనే స్వామి నాయక్ కు వరసకు తమ్ముడు అయ్యే సుంకేనాయక్ అనే యువకుడు వదిన మంగమ్మపై మనసుపడ్డాడు.
దీంతో మంగమ్మ కూడా మరిది సుంకే నాయక్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇదిలా ఉంటే బుధవారం మంగమ్మ ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్లారు. ఇక ఆలస్యం చేయకుండా మరిది సుంకేనాయక్ మంగమ్మ బెడ్ రూంలోకి దూరిపోయాడు. దీంతో మంగమ్మ, సుంకేనాయక్ ఇద్దరు బెడ్ రూంలో తెగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు మంగమ్మ భర్త స్వామి నాయక్.
బెడ్ రూం తలుపు తెరవగా తమ్ముడు సుంకే నాయక్ తన భార్యతో ఊహించని రీతిలో కనిపించాడు. ఈ సీన్ ను చూసిన స్వామి నాయక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక కోపంతో ఊగిపోయిన స్వామి నాయక్ కత్తితో తమ్ముడైన సుంకే నాయక్ ను దారుణంగా పొడిచి చంపాడు. ఇక అడ్డుకోబోయిన భార్యపై సైతం స్వామి నాయక్ దాడి చేసి అక్కడి నుంచి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.