నేటి పిల్లలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చుదిద్దాల్సిన ఉపాధ్యాయులే వారిని వక్రమార్గంలోకి తీసుకెళ్తున్నారు. ఇంతటితో ఆగకుండా చేసిన దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ఎన్నో ఎత్తుగడలు కూడా వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఓ లేడీ టీచర్ ఇంటర్ చదివే కుర్రాడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ చివరికి టీచర్ హ్యాండ్ ఇస్తూ టీచర్ కాస్త చీటర్ గా మారిపోవడంతో కథ ఊహించని మలుపు తీసుకుంది. ఈ టీచర్ ప్రేమకథలో అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని అంబత్తూరులో షర్మిల అనే యువతి స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఈ యువతి స్కూల్ లో పాఠాలు చేబుతూనే సాయంత్రం తన ఇంటి వద్ద ట్యూషన్ కూడా చెబుతుంది. దీంతో గ్రామంలోనే చాలా మంది పిల్లలు ట్యూషన్ కు వచ్చేవారు. అయితే కుల్లికుప్పం ప్రాంతానికి చెందిన కృష్ణకుమార్ అనే ఇంటర్ యువకుడు సైతం షర్మిల వద్దకు ట్యూషన్ కు వస్తుండేవాడు. అలా వచ్చి చదువుకుంటున్న క్రమంలోనే ఆ టీచర్ కృష్ణకుమార్ తో ప్రేమలో పడింది. అలా కొంత కాలానికి ఆ కుర్రాడు సైతం టీచర్ ప్రేమలో పడిపోయాడు.
దీంతో ఇద్దరు కలిసి కొన్నాళ్ల పాటు ప్రేమాయణాన్ని సాగించారు. అలా వీరి లవ్ స్టోరీ కొన్ని రోజులు గడిచింది. కట్ చేస్తే ఇటీవల కాలంలో ఈ యువతికి ఇంట్లో పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఇదే ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి తెలియకుండా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకునేందుకు షర్మిల రెడీ అయింది. ఈ క్రమంలోనే షర్మిల ప్రియుడు కృష్ణకుమార్ తో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఫోన్ చేయడం, అతనితో కలవడమే మానేసింది. చివరికి ఆ కుర్రాడికి తెలిసింది ఏంటంటే? తన ప్రియురాలు మరొకడితో పెళ్లికి సిద్దపడుతుందని.
ఈ విషయం తెలుసుకున్న ఆ మైనర్ బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన ప్రియురాలు లేనిది నేని ఈ బతకు నాకొద్దు అని.., చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సంచలన నిజాలు బయటపడ్డాయి. కృష్ణకుమార్ ను గత కొంత కాలం నుంచి షర్మిల అనే టీచర్ ప్రేమించిందని, అయితే ఈ మధ్య కాలం నుంచి షర్మిల అతనితో మాట్లాడకపోవడంతోనే కృష్ణకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. అనంతరం పోలీసులు నిందితురాలు షర్మిలపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.