సొసైటీలో ఎల్లపుడు శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం.. నేరాలను నిరోధించడం ఎలాంటి అల్లర్లు, విధ్వంసాలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.
సమాజంలో ఎల్లపుడు శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. కానీ కొంతమంది పోలీసులు అరాచకాలు, అవినీతి పనులకు పాల్పపడుతూ.. డిపార్ట్ మెంట్ కి చెడ్డపేరు తెస్తున్నారు. ఓ పోలీస్ ఈ-చలాన్ డబ్బులు వసూలు చేసి సొంతానికి వాడుకున్న సంఘటన హర్యానా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉంటూ నిజాయితీగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ చేతి వాటం చూపించాడు. అతడు డ్యూటీలో ఉన్న సమయంలో ఈ-చలాన్లు విధిస్తుంటాడు. అలా ఈ-చలాన్ల ద్వారా వచ్చిన డబ్బు ప్రతిరోజూ బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.. కానీ సదరు పోలీస్ మాత్రం తన అవసరాలు తీర్చుకొని మిగిలినది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తూ వచ్చాడు. అలా ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా మూడేళ్లుగా కానిస్టేబుల్ ఇలాగే చేస్తూ వచ్చాడు. మూడేళ్లలో అతడు రూ.3.23 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం రూ.30 లక్షలు మాత్రమే బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సదరు కానిస్టేబుల్ ఘనకార్యం పోలీసులకు తెలిసింది. అతడిని అరెస్ట్ చేద్దామని చూస్తే తప్పించుకుతిరుగుతున్నాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసింది.
హర్యానా రాష్ట్రం పాల్వాన్ లో ఈ- చలాన్ లలో రూ.3.23 కోట్ల మేరకు మోసగించినందుకు హర్యానా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ చేశారు.. అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పోలీసులపైనా ఈ-చలాన్ డబ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేయలదనే ఆరోపణలపై డీఎస్పీ ర్యాంక్ అధికారి దర్యాప్తు అధారంగా ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానక్, ఓం వీర్ లపై పాల్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిలో ఓం వీర్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జానక్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 2020 నుంచి మార్చి 31 నుంచి 2023 వరకు ఉన్న రికార్డులు పరిశీలించగా ఎస్బీఐ బ్యాంకుఖాతాలో రూ.3.23 కోట్లు జమకావాల్సి ఉండగా కేవలం రూ.30 లక్షలు మాత్రమే జమ అయినట్లు తేలింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిపార్ట్ మెంట్ సదరు నింధితులపై కేసు నమోదు చేశారు.