టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ కుమారులైన ప్రభు, అరుణ్‌లపై జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో వారి వ్యక్తిగత ఆర్థిక కారణాల వల్ల గుంటూరుకు చెందిన సోమశేఖరరావు వద్ద రూ. 2.10 కోట్లు అప్పు తీసుకున్నారట. దీంతో వాళ్లు పలుమార్లు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదంటూ సోమశేఖరరావు వాపోతున్నారు.
దాసరి ఉన్న సమయంలో డబ్బులు ఇవ్వటానికి ముందుకొచ్చారని, ఆనంతరం వారు మళ్లీ నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇక మళ్లీ అడిగితే ఇవ్వకుండా చంపుతామని బెదిరిస్తున్నారని అని తెలిపారు. టాలీవుడ్‌లో మంచి పేరున్న దాసరి కుమారులు ఇలా చేయటం ఏంటని పలువురు వాపోతున్నారు. దీంతో దాసరిపై ఉన్న పేరును అంతా చెడుగొడుతున్నారని టాలీవుడ్‌లో కొందరు గుసగుసలాడుతున్నారు.