సంచలనం సృష్టించిన సైదాబాద్ బాలిక హత్యాచార ఘటన మరవకముందే, నగరంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడో కామంధుడు. వివరాలు.. హబీబ్‌నగర్‌లోని మాంగరు బస్తీలో తొమ్మిదేళ్ల బాలికను ఖాళీ దుకాణంలోకి సుమిత్ అనే యువకుడు లాక్కెల్లి, లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. దీంతో సుమిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటనపై మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అత్తాపూర్‌లో నిందితుడిని లంగర్‌హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.