ఆమె పేరు లాలీ కుమారి. వయసు 20 ఏళ్లు. బిహార్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈమె ఓ యువకుడి ప్రేమలో పడింది. అతను పెళ్లి చేసుకోవడంతో ఆ యువతి ప్రియుడి సోదరుడితో మరోసారి ప్రేమలో పడింది. అతడు కూడా కాదని వెళ్లడంతో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. దీనిని భరించలేకపోయిన రెండవ ప్రియుడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది బిహార్ లోని బెగుసరాయ్ పరిధిలోని చఖమిద్. ఇదే ప్రాంతానికి చెందిన లాలీ కుమారి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే కొంతకాలానికి ఆ యువతికి బిట్టుకుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారడంతో ఇద్దరు కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. కొడుకు ప్రేమా, గీమా అని జులాయిగా తిరుగుతుండడంతో తల్లిదండ్రులు ఆ యువకుడికి ఓ యువతితో వివాహం జరిపించారు. ప్రియుడికి పెళ్లి అయిపోవడంతో ఆ ప్రియురాలు ప్రియుడి సోదరుడైన కుమార్ అనే యువకుడితో మరోసారి ప్రేమలో పడింది. కుమార్, లాలీ కుమారి కొంత కాలం పాటు ప్రేమ పేరుతో తిరిగారు.
ఈ విషయం తెలుసుకున్న ఈ యువకుడి కుటుంబ సభ్యులు అతడిని ఆ యువతికి కనిపించకుండా బెంగుళూరుకు పంపించారు. ఇతను కొంత కాలం పాటు కనిపించకుండా పోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆ లాలీ కుమారికి స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రియురాలు పెళ్లిచేసుకున్న విషయాన్ని తెలుసుకున్న కుమార్ కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయాన్ని అతని సోదరుడైన బిట్టుకుమార్ కు వివరించాడు. ఎలాగైన సరే లాలీ కుమారిని చంపాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే ఇద్దరు సోదరులు ఆ యువతి ఉంటున్న గ్రామానికి వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పారు.
దీంతో ఆ యువతి ఎగేసుకుని వారున్న చోటకు రానే వచ్చింది. ఆ యువతి రాగానే ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.