దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఓ లేడీస్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాను అమర్చి తన మొబైల్ ద్వారా అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు చేసి యువతులను తనతో శృంగారంలో పాల్గొనాలని.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరించసాగాడు. ఆ యువకుడి టార్చర్ భరించలేక యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు లో పాండిచ్చేరికి చెందిన నిరంజన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. అక్కడ ఉండేవారందరితో చాలా చనువుగా ఉంటూ అందరిచే మంచివాడు అనిపించకున్నాడు. ముఖ్యంగా ఓనర్ తో చాలా సన్నిహితంగా ఉంటూ.. వాళ్ల ఇంట్లో పనులు చూసుకునే వాడు.. దీంతో ఆ ఇంటి ఓనర్ కి నిరంజన్ పై ఎంతో నమ్మకం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ లేఅవుట్ లో కొంత మంది అమ్మాయిలు పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. అందులో ఒక అమ్మాయిపై కన్నేసిన నిరంజన్ ఆమె బాత్ రూమ్ లో రహస్యంగా కెమెరా అమర్చి నగ్నవీడియోలు చిత్రీకరించాడు.
రహస్యంగా చిత్రీకరించిన వీడియో ఆ అమ్మాయి నెంబర్ తెలుసుకొని పంపించేవాడు.. తనతో శృంగారంలో పాల్గొంటే వాటిని సీక్రెట్ గా ఉంచుతానని.. లేదంటే ఫోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని ట్రాప్ చేసి పట్టుకొని కేసు నమోదు చేశారు. అతని సెల్ ఫోన్ లో మరికొంత మంది అమ్మాయిల నగ్న ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని.. వారిని కూడా బెదిరించి ఏమైనా చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.