షాపింగ్ మాల్స్, టాయిలెట్ రూమ్ లు, హాస్టల్ రూమ్స్ లలోనే కాదు అద్దెకు తీసుకునే ఇళ్లలోనూ రహస్య కెమెరాలను పెడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు అద్దెకు వచ్చే అమ్మాయిల మీద కన్నేస్తున్నారు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఓ లేడీస్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాను అమర్చి తన మొబైల్ ద్వారా అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు చేసి యువతులను తనతో శృంగారంలో పాల్గొనాలని.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరించసాగాడు. ఆ యువకుడి టార్చర్ భరించలేక యువతులు […]