గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ జీవితంలో మరో మహిళ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెతో అతీక్ అహ్మద్ కు సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఆమె క్రమం తప్పకుండా అతీఖ్‌ను కలిసేదని, ఈ విషయమై ఆయన భార్య షైస్తా పర్వీన్ అభ్యంతరం వ్యక్తం చేసేవారని తెలుస్తోంది.
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దుండగల చేతిలో హతమైనన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పోలీసుల అదుపులో ఉన్న వారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా.. ముగ్గురు దుండగులు వారిని పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టి కాల్చి చంపారు. ఇప్పటికే పోలీసులు అతని అవినీతి సామ్రాజ్యంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ గత రెండు నెలలుగా పరారీలో ఉండగా ఆమె ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇదిలావుంటే అతీఖ్ అహ్మద్ జీవితంలో మరో మహిళ ఉన్నట్లు విచారణలో బయటపడింది.
అతీక్ అహ్మద్ కు.. షబానా అనే మహిళతో సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. షబానా అనే పేరున్న ఈ మహిళ అతీఖ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న సబర్మతి జైలులో కలిశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పాటు దేవరియా, బరేలీ, ప్రయాగ్‌రాజ్ జైళ్లలో కూడా ఆమె అతీఖ్‌ను కలిసినట్లు బయటపడింది. అతీఖ్ మాఫియా ప్రపంచంతోనూ ఆమెకు సంబంధం ఉందని, షబానా క్రమం తప్పకుండా అతీఖ్‌ను కలుస్తుండటంపై ఆయన భార్య షైస్తా పర్వీన్ అభ్యంతరం వ్యక్తం చేసేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ అభిప్రాయభేదాలపై కూడా పోలీసులకు అతీఖ్ గ్యాంగ్ సభ్యుల నుంచి సమాచారం అందినాలంటూ తెలుస్తొంది. షబానా ప్రయాగ్‌రాజ్‌లోని కరేలీలో ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలన్నీ ఆమె ఏం చెప్తారా..? అని ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
మరోవైపు అతీక్ అహ్మద్ భార్య.. షైస్తా పర్వీన్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆమె కోసం యూపీ ఎస్టీఎఫ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ, లక్నోలోని పలుచోట్ల గాలింపు జరిపారు. ఢిల్లీ కరోల్‌బాగ్, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో ఆమె కోసం పలువురిని ప్రశ్నించారు. ఆమెపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ఉంది. అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్ కీలకంగా వ్యవహరించారని పోలీసుల అనుమానం. అతి త్వరలోఆమె జాడ కనిపెడతామని పోలీసులంటున్నారు. ఇంతలోనే షబానా విషయం బయటకు రావడంతో ఆమె ద్వారా అతీఖ్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు.
అతీఖ్ 4సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా గెలిచారు. తన తమ్ముడు అష్రఫ్‌ను ఓడించాడన్న కక్షతో బీఎస్పీ అభ్యర్థి రాజు పాల్‌ను 2005లో అతీఖ్ హత్య చేయించాడు. ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉమేశ్ యాదవ్ అనే న్యాయవాదిని అతీఖ్ అహ్మద్ ఫిబ్రవరి 24న హత్య చేయించాడు. అతీఖ్ నేర సామ్రాజ్యాన్ని అంతం చేసింది. కాగా అతీఖ్.. అష్రఫ్ ను కాల్చిచంపడానికి రెండు రోజుల క్రితం ఝాన్సీ వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అసద్, అతడి స్నేహితులు గులాం హతమయ్యారు.