వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని భావించారు. ఆ నమ్మకంతో యువతి అతడికి అన్ని విధాల చేరువయ్యింది. తీరా ఆమె గర్భం దాల్చాక.. ఆ యువకుడు ముఖం చాటేశాడు. చెప్పాపెట్టకుండా.. సొంత ఊరికి వెళ్లిపోయాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడు.. అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. అప్పుడు కేసు పెట్టిన ఆమె.. ఇప్పుడతనికి బెయిల్ ఇవ్వమని ఎందుకు కోరుతుంది.. అసలు ఏం జరిగింది.. తెలియాలంటే.. ఇది చదవండి.
ఇది కూడా చదవండి: రూ.30 పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించాడు..
అహ్మాదాబాద్‌కు చెందని యువతి.. 2021 డిసెంబరు 31న తన ప్రియుడిపై కేసు పెట్టింది. తామిద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని పోలీసులకు చెప్పింది. కానీ తాను గర్భం దాల్చగానే, అతడు మాట మార్చాడని వాపోయింది. తనను వదిలేసి కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు.
ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని మంచంపై మోసుకెళ్లి.. మానవత్వం చాటుకున్న జవాన్లు!ఇక బాధితురాలు నిందితుడిపై కేసు పెట్టినప్పుడు ఆమె గర్భవతి. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి బాధితురాలు కూడా ఒప్పుకుంది. ఇప్పుడు అందరూ అంగీకరించినా.. సదరు యువకుడు జైల్లో ఉండటం పెళ్లికి ఇబ్బందిగా మారింది. దాంతో అప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతే.. ఇప్పుడు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. అతడు జైలు నుంచి విడుదల అయితే.. తన బిడ్డకు తండ్రి ప్రేమ కూడా దొరుకుతుందని కోరింది. ఇప్పుడు ఇరు కుటుంబాలు పెళ్లికి కూడా ఒప్పుకున్నారని.. జైలు నుంచి బయటకు వస్తే.. వివాహం చేసుకుంటామని కోరుతుంది.
ఇది కూడా చదవండి: మహిళా వాలంటీర్ దారుణ హత్య.. ఇనుపరాడ్డుతో కొట్టి ఆపై!
ఈ పిటిషన్‌పై అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించింది. ఐతే తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే ప్రభుత్వానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. నిందితుడు, బాధితురాలు పెళ్లి చేసుకొని..తమ బిడ్డతో సంతోషంగా ఉంటే.. అంతకన్నా ఏం కావాలని ఆయన పేర్కొన్నారు. మరి నిందితుడికి కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదంటే నిరాకరిస్తుందా? అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.