మహిళలకి బయటా లేదు, ఇంటా లేదు రక్షణ. బయట కనబడితే మీద పడిపోతారు. ఇంట్లో ఉంటే ఎత్తుకెళ్ళిపోతారు. రావణాసురిడి కన్నా డేంజరస్‌గా ఉన్నారు ఈ దుండగులు. డైరెక్ట్‌గా ఇంటికొచ్చి గేట్లు పగలగొట్టి మరీ ఇంట్లో ఉన్న యువతిని కిడ్నాప్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 15 మంది దుర్మార్గులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మైలాడుతురై ప్రాంతంలో విఘ్నేశ్వరన్ అనే వ్యక్తి.. బాధితురాలితో స్నేహంగా ఉండేవాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ యువతి అందుకు నిరాకరించింది. దీంతో విఘ్నేశ్వరన్ ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువకుడ్ని స్టేషన్‌కు పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. అప్పటి నుండి యువతిపై పగ పగ పెంచుకున్నాడు విఘ్నేశ్వరన్.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన స్నేహితులతో కలిసి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి గేట్లు బద్దలుకొట్టి యువతిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆ యువతి తల్లి కాపాడమని ఎంత అరుస్తున్నా స్థానికులు కాపాడేందుకు ముందుకు రాలేదు. ఈ 15 మందిని చూసి భయపడి ముందుకు రాలేదు. ఈ దుర్మార్గులు ఆ యువతిని కారులో ఎక్కించుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు.
విఘ్నేశ్వరన్ మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. జాతీయ రహదారిపై కాపు కాసి దుండగులను అడ్డుకున్నారు. విఘ్నేశ్వరన్‌తో పాటు ఉన్న మిగతా దుండగులని అరెస్ట్ చేసి యువతిని సురక్షితంగా ఇంటికి పంపించారు. ఈ విషయంలో వెంటనే స్పందించి యువతిని రక్షించిన పోలీసులకు సెల్యూట్ చెప్పాలి. కొంచెం ఆలస్యం అయి ఉంటే ఈ వార్త మరోలా ఉండేది. బలవంతంగా ఇంట్లోకి చొరబడి యువతిని ఎత్తుకెళ్ళిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో చూసిన జనం “ఎంత సురక్షితమైన సమాజమో” అంటూ మండిపడుతున్నారు. మరి ఇంత ధైర్యంగా ఆ యువతి ఇంట్లోకి చొరబడి ఎత్తుకెళ్ళిన ఈ 15 మంది దుర్మార్గులపై, అలానే ఇలాంటి దుర్మార్గులకి ఎలాంటి శిక్షలు వేస్తే బుద్ధి వస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Yesterday A woman was kidnapped by 15 men from her home in Mayiladuthurai, Tamilnadu.
What a safe Society.@NCWIndia @HMOIndia pic.twitter.com/DdzpnGGs0g— 🇮🇳 Adv Shiwangi 🇮🇳 (@AdvShiva1012) August 3, 2022