భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇద్దరు పోలీసులు సహా వారి భార్యలు, తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో సహా పలువురు వ్యక్తులను రూ. 40 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు 8 మంది మీద ఐపీసీ 120(బి), 420 కేసులు నమోదు చేసి వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పుదు నగర్ లో ఎనథుర్ గ్రామానికి చెందిన జోసెఫ్, మరియా సెల్వి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కొడుకులు ఇరుదయరాజ్, శాయ భరత్ పోలీసులుగా ఉన్నారు. మరొకరు విద్యాశాఖలో పని చేస్తున్నారు. పెద్ద కొడుకు నేర విభాగంలో పని చేస్తుండగా.. ఇంకొక కొడుకు ట్రాఫిక్ పోలీసు విభాగంలో పని చేస్తున్నాడు. ఇరుదయరాజ, శాయ భరత్. వీరు తమ తల్లి, తండ్రి, భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు.
పెట్టుబడుల పేరుతో పలువురు వ్యక్తులను మోసాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి జనంతో పెట్టుబడులు పెట్టించి.. రెండేళ్లలో రూ. 40 కోట్లు కొల్లగొట్టారు. బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నారు. వారి క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా మోసం చేసినట్లు కాంచీపురం ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ ఘరానా మోసంలో తండ్రి జోసెఫ్, తల్లి మరియా సెల్వి, సహోదరులు ఇరుదయరాజ్, శాయ భరత్, వారి భార్యలు జయశ్రీ, సౌమియా, చిన్న కొడుకు, అతని భార్య ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2021లో ఈ స్కామ్ ని ప్రారంభించారని.. ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి పెట్టుబడులు పెట్టించారని అన్నారు.
లక్ష పెట్టుబడి పెడితే లక్ష 30 వేలు వస్తుందని నమ్మబలికించి రూ. 40 కోట్ల వరకూ లాగేశారు. అమాయక జనాలు భారీగా పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ఈ కేటుగాళ్లు చెప్పినట్టే కొంతమందికి లాభాలు ఇస్తూ.. టార్గెట్ అమౌంట్ రీచ్ అయ్యాక ఇవ్వడం మానేశారు. 2022 నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టిన వారికి ఇవ్వలేదు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. రూ. 40 కోట్ల సొమ్ముతో కుటుంబం మొత్తం లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారని, ఇళ్ళు కూడా కొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరి బ్యాంకు స్టేట్ మెంట్లు, రికార్డులు పరిశీలించగా రూ. 25 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. కాగా వీళ్ళను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మధురైలోని ఉసిలంపట్టి గ్రామానికి చెందిన జగదీష్ (39) కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మణిమాల అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా పెట్టుబడుల మీద ఆసక్తితో తన వద్ద ఉన్న డబ్బుతో పాటు.. భార్య నగలు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుని, అప్పు చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టాడు. అయితే తన డబ్బు పోయిందన్న బాధలో మాత్రలను మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మనుషులను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో డబ్బులు కాజేసి జల్సాలు చేస్తున్నారు. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంట్లో భర్తలు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. కానియ్ కానియ్ అని ముందుకు తోస్తే ఇదిగో ఇలానే జైల్లో మగ్గాల్సి వస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.