పెళ్లి నిశ్చయమైన ఒక యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. వారిలో ఒక దుండగుడు ఆ అమ్మాయిని బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తనల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు పరిస్థితి ఇలాగే ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా యువత పరిస్థితి చెప్పనవసరం లేదని చెబుతున్నారు. తాము అడిగింది ఇవ్వకున్నా, తమ మాట కాదన్నా ఎవరనేది కూడా చూడకుండా తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. కొందరైతే ఆవేశంలో ఎవరనేది చూడకుండా దాడులకు దిగుతున్నారు. ఇంకా ప్రేమ, పెళ్లి విషయాల్లోనైతే ఇది మరింత ఎక్కువనే చెప్పాలి. ప్రేమ, పెళ్లికి నో చెబితే కిడ్నాప్ చేయడం, మర్డర్ చేయడం కూడా జరుగుతున్నాయి. వీటి గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో చోటుచేసుకుంది.
పెళ్లికి నో చెప్పిందని ఒక యువతిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఎడారిలోకి ఆ యువతిని తీసుకెళ్లారు దుండగులు. అప్పటికే వివాహం నిశ్చయమైన ఆ యువతిని దుండగుల్లోని ఒకరు బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమెను చేతులతో పైకి ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి సప్తపది పూర్తయిందన్నాడు. మనకు మ్యారేజ్ అయిందని, ఇంకొకర్ని పెళ్లి చేసుకోవద్దని ఆ అమ్మాయిని బెదిరించాడు. ఈ ఘటన జైసల్మేర్లో జూన్ 1వ తేదీన జరిగింది. యువతిని బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను కాపాడాలని, ఇలా చేయొద్దంటూ యువతి కేకలు వేయడం వీడియోలో వినిపిస్తోంది. కాగా, జైసల్మేర్ జిల్లా, మోహన్గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.
ఆ యువతి పెళ్లికి జూన్ 12వ తేదీన ముహూర్తం పెట్టారు. అయితే, అదే ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర సింగ్ (28) అనే యువకుడు జూన్ 1న కొంతమందితో కలసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఇంటి బయట ఉన్న యువతిని దుండగులు ఎత్తుకెళ్లారు. పుష్పేంద్ర ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా చేయొద్దంటూ బాధితురాలు ఏడుస్తున్నా అతడు పట్టించుకోలేదు. ఆ యువతిని తన చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడు సార్లు తిరిగి పెళ్లి అయిపోయిందన్నాడు. మళ్లీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టాడు. బాధితురాలి ఫ్యామిలీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోవైపు, ఘటనకు సంబంధించిన వీడియోను తీసిన దుండగుల్లో ఒకడు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
इस दरिंदगी को देख कर किसी का भी रूप कांप जाए। राजस्थान में दरिंदे लड़की को उठा कर ले गए और जबरदस्ती विरान जंगल में शादी की। लड़की चीखती चिल्लाती रही। @RahulGandhi अमेरिका से घूम–फिर मौज मस्ती कर आयेंगे तो अगले साल अशोक गहलोत जी को जरूर इस घटना पर करवाई करने बोलेंगे। pic.twitter.com/G7YokCWkli
— Naresh Balyan (@AAPNareshBalyan) June 6, 2023