ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ షావోమీకి చెందిన భారత దేశ విభాగంపై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా డీఆర్‌ఐ అధికారులు షావోమీ ఇండియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. షావోమీ ఇండియా సంస్థ పన్ను ఎగవేస్తోందన్న పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Breaking: India’s finance ministry says Chinese electronic company Xiaomi’s Indian subsidiary Xiaomi Tech. India Pvt Ltd involved in tax evasion of Rs 653 cr for almost 4 years; notices served. pic.twitter.com/RCcTCbLWoG
— Sidhant Sibal (@sidhant) January 5, 2022
2017 ఏప్రిల్ నుంచి ఇంపోర్ట్ సుంకాన్ని ఎగవేస్తున్నట్లు గుర్తించినట్లు తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగా తమ వాల్యూని తగ్గించి చూపించుకుంటున్నట్లు గుర్తించామన్నారు. అందుకు సంబంధించిన కీలక పత్రాలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Xiaomi charged of Rs 653 crore tax evasion in India…
— Mukul Sharma (@stufflistings) January 5, 2022
ఈ విషయంపై ఇంకా షావోమీ ఇండియా స్పందించలేదు. దిగుమతి చేసుకునే వస్తువులకు రాయల్టీ, దిగుమతి సుకం చెల్లించలేదని తేలిందన్నారు. ఇదే విషయంపై కేంద్రం కూడా స్పందించింది. ‘మొబైల్ ఫోన్లు, వాటి పరికరాల వంటివి దిగమతి చేసుకుంటూ.. ట్రాన్సాక్షన్ వ్యాల్యూలో రాయల్టీ, లైసెన్సు రుసుము జోడించకుండా కస్టమ్స్ ట్యాక్సును షావోమి ఇండియా ఎగవేస్తోంది. పూర్తి దర్యాప్తు తర్వాత.. షోవోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 3 షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం… 2017 ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30 మధ్య రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాలని ఆదేశించాం’ అంటూ కేంద్రం వెల్లడించింది.
Xiaomi India slapped with Rs. 653 crore notice for alleged tax evasion https://t.co/JAcWvr2iKm pic.twitter.com/ORvd4SMIqw
— Gadgets 360 (@Gadgets360) January 5, 2022