సముద్రంలో ఎన్నో అద్భుతమైన జలచరజీవులు ఉంటాయి. అందులో అతి పెద్ద జలచర జీవి తిమింగలం. వీటిని ప్రత్యక్షంగా చూడటం చాలా కష్టం.. డిస్కవరీ ఛానల్ పుణ్యమా అని ఇలాంటి జీవులను చూడగలుగుతున్నాం.
సాధారణంగా సముద్రాల్లో సంచరించే భారీ జలచరాల గురించి వినడం తప్ప వాటిని ప్రత్యక్షంగా చూడటం చాలా తక్కువ. ఎందుకంటే భారీ జలచరాలు పెద్ద సముద్రంలో ఉంటాయి.. అక్కడికి రిస్క్ చేసి వెళ్లడం చాలా కష్టం. కాకపోతే టెలివిజన్ లో వచ్చే డిస్కవరీ ఛానల్స్ లో వీటిని చూసే అవకాశం ఉంటుంది. అసలు సముద్రాల్లో ఇంతపెద్ద జలచరాలు ఉంటాయా అన్న విషయం ఇలాంటి చానల్స్ వచ్చిన తర్వాతే జనాలకు తెలిసింది. సముద్రంలో ఉంటే స్పర్మ్ తిమింగళాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి స్రవించే వాంతికి కోట్ల విలువ ఉంటుంది. ఈ వాంతిని ‘అంబర్ గ్రిస్’ అని పిలుస్తారు. అంతేకాదు సముద్రంపై ‘తేలియాడే బంగారం’గా పిలుస్తారు. కొంతమంది స్మగ్లర్లు ‘అంబర్ గ్రిస్’ అక్రమరావాణా చేస్తూ కోట్లు సంపాదిస్తుంటారు. అలా అక్రమంగా తరలిస్తున్న వేల్ అంబర్‌గ్రీస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ మార్కెట్‌లో లో కోట్లు విలువ చేసే వెల్ అంబర్‌గ్రీస్‌ను (తిమింగల వాంతి) తమిళనాడు డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ఖరీదు చేసే అంబర్ గ్రీస్ ను సముద్ర మార్గంలో తరలించేందుకు సిద్దమైనట్లు పక్కా సమాచారం రావడంతో అధికారులు రంగంలోకి దిగి టుటికోరిన్ సీ కోస్ట్ వద్ద పట్టుకున్నారు. 18.1 కేజీల వరకు అంబర్‌గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ రూ.31.6 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని డీఆర్ఐ పేర్కొంది. అంబర్‌గ్రీస్‌ను ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తుంటారు. సముద్రంలో తెలియాడే ఈ అంబర్‌గ్రీస్‌ను అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. కొన్నిసార్లు మత్స్యకాకులకు కూడా దొరుకుతుంది.
సముద్రంలో స్పెర్మ్ తిమింగలాల వాంతికి అంబర్ గ్రిస్ అంటారు.. ఇది కోట్ల విలువ ఉంటుంది. సాధారణంగా స్పర్మ్ తిమింగళాల జీర్ణవ్యవస్థలో ఇది సహజసిద్దంగా తయారవుతుంది. భారీస్థాయిలో ఉంటే సముద్ర జీవులను స్పర్మ్ తిమింగళాలు మింగినపుడు.. వాటిలో ఉండే కఠినమై…పదునైన వస్తువలును బయటకు పంపించేందుకు అంబర్ గ్రీస్ ఉపయోగపడుతుంది. స్పర్మ్ తిమింగళాలు వేటాడినపుడు ఒక ప్రత్యేక పదార్ధాలను విడుదల చేస్తాయి. శరీంలోని వ్యర్థాలను ఇంది వాంతి చేస్తుంది.. ఆవి నీటిపై తేలియాడుతూ ఉంటాయి. సముద్రంలోని ఉప్పనీరు, సూర్యరశ్మి ప్రభావం వల్ల ఆ వాంతి కాస్త ‘అంబర్ గ్రీస్’ పదార్థంగా మారిపోతుంది.
స్పెర్మ్ తిమింగలాల వాంతి మొదట దుర్వాసన వచ్చినప్పటికీ.. కాలం గడుస్తున్నా కొద్ది ఆ వాసన సుగంద పరిమళాలు వెదజల్లుతాయి. అంబర్ గ్రీస్ తెలుపు, నలుపు, బూడిద రంగు లో ఉంటా.. మైనంలా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు రాళ్లమాదిరగా ఉంటాయి.. కొన్ని కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. అంబర్ గ్రిస్ స్వచ్ఛత, నాణ్యతను బట్టి కిలో రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతుంది. ఇది అత్యంత అరుదుగా లభిస్తుంది కనుకనే అంత డిమాండ్ అంటారు. అంబర్ గ్రీస్ ను ఎక్కువగా ప్రయోగాల కోసం, ఔషదాలు, సుగంధ ద్రవ్యాల తయారీ కోసం ఉపయోగిస్తుంటారు. అందుకే వీటిపై ఎక్కువగా స్మగ్లర్ల కన్ను ఉంటుంది. గతంలో తమిళనాడు నుంచి విదేశాలకు తరలించే ఎంతోమంది స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Tamil Nadu: DRI arrested 4 smugglers and seized 18.1 Kg whale ambergris worth Rs 31.6 crores, near the Tuticorin Sea coast: Customs
(Video source: Customs pic.twitter.com/b2FAH5hgVz
— ANI (@ANI) May 20, 2023