చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ.. భారత్ మార్కెట్‌లోకి ‘రెడ్‌మీ నోట్12’ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో +.. ఇలా మూడు మోడళ్లను తీసుకొచ్చింది. ఇందులో బేస్ మోడల్ నోట్ 12 ధర రూ.17,999కాగా, నోట్ 12 ప్రో ధర రూ.26,999గా ఉంది. ఇకహైఎండ్ మోడల్ నోట్ 12 ప్రో + ధర రూ. 29,999గా నిర్ణయించారు. అయితే.. కొనుగోలుదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, బోనస్ ఆఫర్లు కలుపుకుంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ మూడు ఫోన్లలోనూ 5జీ సేవలు లభ్యం అవుతాయి. రెడ్ మీ నోట్ సిరీస్ ఫోన్లలో 5జీ సేవలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి.
రెడ్‌మీ నోట్ 12 సిరీస్ లో ఇది బేస్ వేరియంట్. 4జీబీ+ 128జీబీ, 6జీబీ+ 128జీబీ.. రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనుంది. 6.67 ఇంచెస్ FHD+ AMOLED డిస్‌ప్లే, క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్, (48 ఎంపీ + 8ఎంపీ + 2 ఎంపీ)ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ HDR+ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వెనుకవైపు (108ఎంపీ +8ఎంపీ + 2ఎంపీ) ట్రిపుల్ కెమెరా సెటప్ , సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించారు.
నోట్ 12 సిరీస్ లో ఇది హైఎండ్ వేరియంట్. ఇందులో 200 మెగాపిక్సల్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ HDR+ డిస్‌ప్లే., మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్, 5000 బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించారు.
జనవరి 11 నుంచి రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్ల విక్రయం ప్రారంభం అవుతుంది. ఈ- కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ సహా, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోమ్‌ల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ధర ఎక్కువుగా అనిపించినా .. బ్యాంక్ డిస్కౌంట్లు, బోనస్ ఆఫర్లు కలుపుకొని తక్కువ ధరకే సొంతం చేవెసుకోవచ్చు. ఎం ఐ ఫోన్లకు ఇంత ధర వెచ్చించవచ్చా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RedmiNote12 Vs #RedmiNote12Pro Vs #RedmiNote12ProPlus
Which one is the value-for-money Note according to you? 🤔Comment below. 👇@RedmiIndia #SuperNote #RedmiNote12Series pic.twitter.com/jNxEiWOnSi
— TrakinTech (@TrakinTech) January 5, 2023