షావోమీ కంపెనీకి ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ గా భారత్ మారుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్ లో షావోమీ కంపెనీ భారత్ కే పెద్దపీట వేస్తోంది. ఇండియా కోసం అన్నీ ఎంతో ప్రత్యేకంగా, అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి అంశంలో భారత యూజర్లను మెప్పించేందుకు షావోమీ కంపెనీ చూస్తోంది.
షావోమీ కంపెనీకి భారత్ లో ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ తమ షావోమీ 13 ప్రో ఫోన్ ని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. అయితే అదొక్కటే ఇక్కడ న్యూస్ కాదండోయ్.. ఆ తర్వాత రోజు షావోమీ కంపెనీ తమ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ MIUI 14ని ఇండియాలో లాంఛ్ చేయబోతోంది. గతేడాది డిసెంబర్ లో ఈ వర్షన్ ని చైనాలో విడుదల చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి 27న భారత్ లో ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని లాంఛ చేయనుంది. అయితే MIUI 13కి దీనికి ఏంటి తేడా? అదనంగా దీనిలో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు యూజర్లు అడుగుతున్నారు. మరి.. MIUI 14లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయో చూద్దాం.
ఫిబ్రవరి 27న షావోమీ ఎంఐయూఐ 14 వర్షన్ అధికారికంగా భారత్ లో లాంఛ్ కానుంది. అయితే ఇప్పటికే చైనాలో విడుదలైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే కూడా భారత్ లో లాంఛ్ కానున్న వర్షన్ మరింత భిన్నంగా, అదనపు ఫీచర్లతో ఉండబోతోంది అని చెబుతున్నారు. రెడీ- స్టెడీ- స్మూత్ అంటూ దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ వర్షన్ లో యూజర్లు ఆనందించాల్సిన ముఖ్యమైన విషయం ఈ అప్ డేట్ కాస్త తక్కువగానే ఉంటుంది. అంటే ఎంఐయూఐ 13తో పోల్చుకుంటే 1.5 జీబీ తక్కవ సైజ్ లో వస్తుందని చెబుతున్నారు. అలాగే ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ కూడా తక్కువే ఉంటాయని తెలుస్తోంది.
For 12 years, MIUI has been committed to boosting the industry progress, and deepening the collaboration between software and hardware from new perspectives.
Thanks for all the support and expectations!❤️
MIUI 14 launch is coming. Stay tuned! 🥳🔝#MIUI14launch #Xiaomi pic.twitter.com/41CX0CoikD— MIUI (@miuirom) February 20, 2023
ఈ వర్షన్ లో మీరు తరచూ వాడకుండే యాప్స్ ను ఆటోమేటిక్ గా కంప్రెస్ చేస్తుంది. సరికొత్త ఐకాన్ డిజైన్స్, విడ్జెట్స్, కస్టమైజబుల్ ఫోల్డర్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉండబోతున్నట్లు చెబుతున్నారు. షావోమీ ఆర్టిఫీషియల్ అసిస్టెంట్ 6.0, సెక్యూరిటీ ఫీచర్స్, ప్రైవసీ ఫీచర్స్, ఐవోఎస్ 15 తరహాలో హెల్త్ షేరింగ్ వంటి ఎన్నో అద్భుతమైన పీచర్స్ ఈ ఎంఐయూఐ 14లో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. గత అన్ని వర్షన్స్ తో పోలిస్తే.. ఈ ఎంఐయూఐ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో షావోమీ యూజర్స్ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ పొందుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
MIUI 14 is launching on this date in India#MIUI14 #Redmi #Xiaomi #Poco pic.twitter.com/fddVgQqoPG
— Smartprix (@Smartprix) February 23, 2023