ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేని మనిషి ఎవరైనా ఉంటారా? అస్సలు ఇది కుదిరే పని కాదు. ఈరోజుల్లో డబ్బు లేనిదే బతుకు బండి ముందుకి వెళ్ళదు. కాకుంటే., ఎంత సంపాదించినా ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో సడెన్ గా ఏమైనా అవసరాలు ఏర్పడితే.. ఆర్ధిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది బయట ఎక్కువ వడ్డీ రేట్లకి అప్పులు తీసుకుని , ఆ వడ్డీలు పెరిగిపోయి, వాటిని కట్టలేక నానా కష్టాలు పడుతుంటారు.
కానీ.., స్వల్ప కాలిక అవసరాలకి బయట అప్పులు చేయడం కన్నా బ్యాంక్స్ లో పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా బెటర్. మీ దగ్గర గోల్డ్ ఉన్నట్టు అయితే ముందు గోల్డ్ లోన్ ని ప్రైమరీ ఆప్షన్ గా పెట్టుకోండి. ఒకవేళ ఆ సమయానికి గోల్డ్ అందుబాటులో లేకుంటే అప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ కి వెళ్ళండి.
పర్సనల్ లోన్ రావాలంటే ముందుగా క్రెడిట్ స్కోర్ బాగుండాలి. కనీసం 750 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు పర్సనల్ లోన్ లభిస్తుంది. ఇదే సమయంలో లోన్ తీసుకునే వారి వయసు, సంపాదన, మిగతా క్రెడిట్, డెబిట్ వివరాలను బ్యాంక్ అధికారులు పరిగణంలోకి తీసుకుంటారు. ఈ అంశాలును బట్టి మీకు ఎంత పర్సనల్ లోన్ లభిస్తుందన్నది తెలుస్తుంది. ఇక డాక్యుమెంటేషన్ పెర్ఫెక్ట్ గా ఉంటే.. చాలా తక్కవ సమయంలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే కరోనా నేపథ్యంలో చాలా బ్యాంక్స్ పర్సనల్ లోన్ పై తమ వడ్డీ రేట్లని తగ్గించాయి. మరి.. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న ఆ టాప్ టెన్ బ్యాంక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.