ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీము ద్వారా మీరు నెలకు 11 వేలకు పైగా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కీముల్లో ఇదే ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.
దేశ దిగ్గజ బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం నిత్యం ఏదో ఒక కొత్త స్కీము అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. సదరు స్కీముల ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ తమ కస్టమర్ల కోసం ఓ అద్భుతమైన స్కీమును ప్రవేశపెట్టింది. ఆ స్కీము ద్వారా నెల నెలా దాదాపు 11 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. ఆ స్కీము పేరే ఎస్‌బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్. ఇంతకీ ఈ స్కీం ఏంటంటే..
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీములో చేరటం వల్ల క్రమం తప్పకుండా రాబడి పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు ఈ స్కీము ఎంతో ఉత్తమంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న అన్ని స్కీముల్లోకి ఎస్‌బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీము ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కస్టమర్లకు వడ్డీతో పాటు పెట్టుబడిగా పెట్టిన దానిలో కొంత భాగాన్ని చెల్లిస్తారు. ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్‌లో మీరు 10 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే నెలకు 11, 870 రూపాయలు పొందొచ్చు.
ఇందులో తొలి నెల వడ్డీ 6250 రూపాయలు ఉండగా.. పెట్టుబడిగా పెట్టిన మొత్తంలో కొంత భాగం 5620 రూపాయలు వస్తాయి. ఈ యాన్యుటీ ప్లాన్ టెన్యూర్ 10 ఏళ్లు ఉంటుంది. మీడియం టర్మ్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకునే వారు ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీములో చేరటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీములో చేరటం వల్ల సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మరి, ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీముపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.